అనకాపల్లి పట్టణ ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయంతో ముడిపడి ఉంది. అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగంతో సంబంధాలు కలిగి ఉన్నారు. పంటలు పండితే గాని వీరి పోషణ కష్టం. ప్రధానంగా ఈ ప్రాంత రైతాంగం వరి, చెరుకు, కాయగూరలు ఎక్కువగా పండిస్తుంటారు. చెరుకు పంట, బెల్లం వంట, అనకాపల్లి పరిసర ప్రాంతాల రైతుల జీవినవిధానంగా మారింది. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా చెరుకు పంట వేసి షుగర్ ఫ్యాక్టరీలకు చెరకును పంపిణీ చేయడం, బెల్లం తయారు చేయడం ఎన్నో ఏళ్లుగా రైతులు అలవాటుగా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బెల్లం మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని బెల్లం తయారీ చేయడం ఇక్కడి రైతుల వ్యవసాయ విధానంగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు బెల్లాన్ని రెండు విధాలుగా తయారు చేస్తారు. ఒకటి రంగుబెల్లం, రెండవది రంగులేని బెల్లం (నల్లబెల్లం). మొదటి విధానమైన రంగుబెల్లం తయారీ విధానంపై ప్రత్యేక కథనం.
అయితే రైతులు రంగుకోసం 70 పిపిఎం (పార్ట్స పర్ మిలియన్) మేరకు దీనిని వినియో గిస్తున్నారు. హైడ్రోస్ కలిపిన బెల్లాన్ని వినియోగించడం ద్వారా మూత్రపిండ సమస్యలు, ఉదరకోశ సంబంధ వ్యాధులు, ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హైడ్రోస్ ఎక్కువగా వాడితే ప్రజల ఆరోగ్యానికి చేటని తెలిసినప్పటికీ మార్కెట్లో తాము తయారుచేసిన బెల్లాన్ని అధిక రేట్లకు అమ్ముకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా చేయాల్సివస్తోందని రైతులు చెబుతున్నారు. హైడ్రోస్ వాడిన బెల్లం బంగారు రంగులో ఉంటే, హైడ్రోస్ వాడని బెల్లం గోధుమ రంగులో ఉంటుంది. దాన్నే నల్లబెల్లంగా పిలుస్తారు. హైడ్రోస్ బదులు సున్నం, బెండమొక్కల గుజ్జు వంటి క్షారపదా ర్థాలు వాడితే మంచి బెల్లం తయారవుతుందని ఇక్కడి వ్యవసాయ పరిశో ధనా స్థానం శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అదే విధంగా సకాలంలో చెరుకును నాటి తగు సమయంలో నరికి సరైన సాగు పద్ధతులను పాటిస్తే నాణ్యమైన ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారుచేయవచ్చని కూడా వారు చెబుతున్నారు. అయినప్పటికీ రైతులు మార్కెట్ డిమాండ్ రీత్యా హైడ్రోస్ ఉపయోగించిన రంగు బెల్లాన్నే ఎక్కువగా తయారు చేస్తున్నారు.
చెరుకు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వ్యవసాయ శాస్తవ్రేత్తలు బెల్లం పరి శ్రమ అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగం గా ఉత్తరాంధ్రలో బెల్లం అధికంగా తయారుచేసే ప్రాంతాల్లో ఆగ్రోప్రాసె సింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యా లయం సన్నాహాలు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో ఆగ్రోప్రాసెసింగ్ సెంటర్‌ను ప్రారంభిం చారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా విజయనగరం, శ్రీకాకు ళం జిల్లాలకు కూడా విస్తరించారు. బెల్లాన్ని ముక్క, పౌడర్, పాకం రూపంలో తయారుచేసి మార్కెటింగ్ చేయడమే ఈ ఆగ్రోప్రాసెసింగ్ సెంటర్ల ప్రధాన ఉద్దేశం. బెల్లాన్ని దిమ్మరూపంలో కాకుండా ముక్కరూపంలో తయారుచేసి అమ్మితే ఏటా రాష్ట్రంలోని బెల్లం రైతులకు కోట్లలో అదనపు ఆదాయం వస్తుం దని శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం కొన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టి అక్కడి బెల్లం రైతులు ముక్కబెల్లం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, మెదక్, నిజామాబాద్, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు బెల్లాన్ని వందగ్రాముల నుంచి వివిధ పరిమాణాల్లో తయారుచేసి అట్టపెట్టెలలో ప్యాకింగ్ చేస్తూ ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు.
కాగా విశాఖజిల్లాలోని రైతులను కూడా ఆ దిశగా మరల్చేందుకు శాస్తవ్రేత్తలు ప్రయత్నించారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముక్కబెల్లం, బెల్లం పౌడర్, బెల్లం పాకం తయా రీ యూనిట్లను ప్రయో గాత్మకంగా రూపొందించి దీనికి సంబం దించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఇక్కడి ఆర్.ఎ.ఆర్.ఎస్‌లో అభివృద్ధి చేశారు. మునగపాక మండలంలో ప్రప్రథంగా ఈ ఆగ్రోప్రాసెసింగ్ సెంటర్‌ను ప్రారంభించి రైతులకు వాటిపై శిక్షణ ఇచ్చి, వారి చేత పరికరాలను కొనుగోలు చేయించి, బెల్లం తయారీ యూనిట్లను నెలకొ ల్పారు. మునగపాక మండలంలో ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ యూనిట్లను ఉపయోగిం చుకుని ముక్క బెల్లాన్ని తయారు చేయడం ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం వారు అందిం చిన పరికరాల ద్వారా ముక్కబెల్లాన్ని తయారుచేసి అమ్మడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని, ఈ విధానం ఎంతో సౌలభ్యకరంగా ఉందని పైప్రాంతాల నుం చి వినియోగదారులు ఇక్కడకు వచ్చి ముక్క బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నారని, తిమ్మరాజు పేటకు చెందిన చెరుకు రైతులు సూరిశెట్టి ముసి లినాయుడు, శరగడం గోవింద, సూరిశెట్టి వెంక టి, నీటి సంఘం అధ్యక్షు లు భీమిశెట్టి నాయుడు తదితరులు తెలిపారు.
ఉపాధి హామీ పథకం అమలుతో కూలీలు దొరకడం లేదు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్క లు చేసుకున్నా నాలుగు డబ్బులు మిగలని దుస్థితి నెలకొంది. రైతుకు చెరుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది సెప్టెం బర్, నవంబర్ నెలల్లో జల్‌తుఫాన్, వర్షాలు, వరదల సమయంలో నష్టాలకు గురైన రైతన్న లకు ఇంతవరకూ ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ప్రభుత్వ అధికారులు పంట నష్టం పై సర్వేలు చేస్తున్నట్లు హడావుడే తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఇదిలా ఉండగా తాజాగా వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా రైతు ల చేతికందిన పంట చేజారిపోయింది. నష్టపో యిన కౌలు రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతు న్నారు.
ఈ సమయంలో ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే ఏడాది రబీ పంట సాగు చేసేందుకు రైతులు సుముఖంగా లేరు. వ్యవసాయం పట్ల అనాసక్తత కనబరు స్తున్నారు. అనకాపల్లి, మునగపాక మండలా ల్లోని చెరుకు పంటపై ఆధారపడే రైతులు ఫ్యాక్టరీలకు చెరుకును సరఫరా చేసేందుకు వెనుకాడుతున్నారు. ఫ్యాక్టరీలు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం. గత ఏడాది పంచదార ధరలు బాగుండడంతో గోవాడ షుగర ్‌ఫ్యాక్టరీ 2,200, తాండవ, ఏటికొప్పాక షుగర్‌ఫ్యాక్టరీ లు 1800 రూపాయలు, తుమ్మపాల షుగర్‌ఫ్యాక్టరీ 1700 రూపాయలు రైతులకు మద్దతు ధరగా చెల్లించాయి. ఈ ఏడాది చక్కెర ధరలు తగ్గాయి. గత ఏడాది మాదిరి గా మద్దతు ధర చెల్లించడానికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు జంకుతున్నాయి. ఇప్పటికే చోడవరం షుగర్‌ఫ్యాక్టరీ, ఏటికొప్పాక షుగర్‌ఫ్యాక్టరీలు మద్దతు ధరను 1800 రూపాయలు ప్రకటించి, క్రషింగ్స్‌ను మొదలుపెట్టాయి. కాగా ఈ మద్దతు ధరపై నిన్నటి వరకూ ఒక నిర్ణయానికిరాని తుమ్మ పాల షుగర్‌ఫ్యాక్టరీ ఎట్టకేలకు స్పందించింది.
1700 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్టు ఫ్యాక్టరీ చైర్మెన్ డి.ఆర్.డి.ఎ - పి.డి.శ్రీకాంత్ ప్రభాకర్ ఇటీవల ప్రకటించారు. ఈ మద్దతు ధర తమకు ఏ కోశానా సరిపోవడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తుమ్మపాల షుగర్‌ఫ్యాక్టరీ పరిధిలో బెల్లం గానుగలు, క్రషర్లు ఎక్కువగా ఉన్నాయి. చెరుకును ఫ్యాక్టరీకి తరలించేకంటే రైతే స్వయంగా బెల్లం గానుగాడుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరుకు పంట నీటమునిగిపోవడంతో చెరుకులో ఎదుగుదల లోపించింది. దిగుబడులు తగ్గిపోయాయి. చక్కెర శాతం పడిపోయింది. దీనికి తోడు అనకాపల్లి బెల్లం మార్కెట్ లో బెల్లం రేటు ఆశాజనకంగా లేకపోవడం రైతులను కుంగదీస్తోంది. గత ఏడాది మార్కెట్లో బెల్లం దిమ్మ ఖరీదు 325 రూపాయలు ధర పలకగా ప్రస్తుతం ఈ సీజన్లో 200 రూపాయలకు మించి ధర రావడంలేదు. దీంతో చెరుకు రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టా డుతున్నాడు. ఇదిలా ఉండగా నల్ల బెల్లం సమస్య రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరుకు తోటలు నీటమునిగి ఉన్నాయి. దీనికి తోడు చెరుకు రైతులు నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో విపరీతంగా నష్టపోతు న్నారు.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు గత ఏడాది 25,96,108 బెల్లం దిమ్మలు రైతుల ద్వారా దిగుమతి కాగా వాటిలో సగం నల్లబెల్లానికి చెందినవే. నల్ల బెల్లానిి, రంగుబెల్లానికి మధ్యధర వ్యత్యాసం ఎంతో ఉంది. మార్కెట్లో నలుపు, రంగు బెల్లం మధ్య ధర వ్యత్యాసం పదికిలోలకు 200 వరకు ఉంటుంది. ఈ కారణంగా నల్లబెల్లం తయారుచేసిన రైతులు తీవ్రంగా ధర విషయంలో నష్టపోతున్నారు. మార్కెట్లో రంగుబెల్లానిి డిమాండ్ ఉండడంతో నల్లబెల్లం వైపు ఎవరూ మొగ్గుచూపడం లేదు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. నల్లబెల్లానికి, రంగుబెల్లానికి మధ్య ధరవ్యత్యాసం వలన నల్లబెల్లం పంపిణీ చేసే రైతులు ఎకరాకు 20,000 వరకు నష్టపోవలసి వస్తోంది. నల్లబెల్లం తయారీ రైతు కావాలని తయారు చేయడం జరగదు. పండించే నేలలను బట్టి, ఎంచుకున్న రకాలను బట్టి బెల్లానికి ఈ రంగు వస్తుంది. చెరుకు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించక పోవడంతో బెల్లంలో నాణ్యత తగ్గి బెల్లం నలుపు రంగుకు మారుతోందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. బెల్లం తయారీ వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నష్టాలు చవిచూస్తున్నామని చెరుకు రైతులు చెబుతున్నారు.
రంగు బెల్లం తయారీ విధానం...
మార్కెట్లో బెల్లానికి ఎంత మంచి రంగు ఉంటే అంత మంచి సరుకుగా పరిగణిస్తారు. అందుకే రంగు బెల్లానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుం ది. వినియోగదారులు, కొనుగోలుదారుల కూడా రంగు బెల్లానికే మక్కువ చూపుతారు. కాగా ఈ రంగు బెల్లం తయారు చేయడానికి రైతులు పడే శ్రమ అంతాఇంతా కాదు. బెల్లాన్ని బంగారపు రంగులో తయారు చేయడాని కి రైతులు ఎంతో శ్రమిస్తారు. ప్రమాదకరమైన రసాయనాలు కూడా కలిపి బెల్లానికి రంగు వచ్చేలా చేస్తున్నారు. ఇటువంటి బెల్లం ప్రమాదకరమని, వినియోగదారులకు చేటు చేస్తుందని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నా రు. మన రాష్ట్రంలో బెల్లాన్ని ఎక్కువగా తయారు చేసే నిజామాబాద్, మెదక్, చిత్తూరు, తూర్పుగోదా వరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తరహా బెల్లాన్ని ఎక్కువ గా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లానికి బంగారపు రంగు వచ్చేందుకు రైతులు హైడ్రోస్ (సోడియం హైడ్రోజన్ సల్ఫేట్) అనే రసాయ నాన్ని వాడతా రు. సాధారణంగా క్వింటాల్ బెల్లం తయారీలో 7 గ్రాములకు మించి సల్ఫర్ వినియోగించకూడదు. అయితే రైతులు రంగుకోసం 70 పిపిఎం (పార్ట్స పర్ మిలియన్) మేరకు దీనిని వినియో గిస్తున్నారు. హైడ్రోస్ కలిపిన బెల్లాన్ని వినియోగించడం ద్వారా మూత్రపిండ సమస్యలు, ఉదరకోశ సంబంధ వ్యాధులు, ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. హైడ్రోస్ ఎక్కువగా వాడితే ప్రజల ఆరోగ్యానికి చేటని తెలిసినప్పటికీ మార్కెట్లో తాము తయారుచేసిన బెల్లాన్ని అధిక రేట్లకు అమ్ముకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా చేయాల్సివస్తోందని రైతులు చెబుతున్నారు. హైడ్రోస్ వాడిన బెల్లం బంగారు రంగులో ఉంటే, హైడ్రోస్ వాడని బెల్లం గోధుమ రంగులో ఉంటుంది. దాన్నే నల్లబెల్లంగా పిలుస్తారు. హైడ్రోస్ బదులు సున్నం, బెండమొక్కల గుజ్జు వంటి క్షారపదా ర్థాలు వాడితే మంచి బెల్లం తయారవుతుందని ఇక్కడి వ్యవసాయ పరిశో ధనా స్థానం శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అదే విధంగా సకాలంలో చెరుకును నాటి తగు సమయంలో నరికి సరైన సాగు పద్ధతులను పాటిస్తే నాణ్యమైన ఆరోగ్యకరమైన బెల్లాన్ని తయారుచేయవచ్చని కూడా వారు చెబుతున్నారు. అయినప్పటికీ రైతులు మార్కెట్ డిమాండ్ రీత్యా హైడ్రోస్ ఉపయోగించిన రంగు బెల్లాన్నే ఎక్కువగా తయారు చేస్తున్నారు.
నాణ్యమైన బెల్లం తయారీ విధానం...
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్తవ్రేత్తలు తెలిపిన ప్రకారం ప క్వానికి వచ్చిన చెరుకు నుంచి నాణ్యమైన బెల్లాన్ని తయారుచేయవచ్చు. చెరు కురసంలో ఉదజని సూచిక 5.2 ఉండాలని, దాని ఆమ్లతను 5.8 వరకు తీ సుకువెళ్లాలని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. చెరుకును నరికిన వెంటనే రసా యనాలకు బదులు తగినంత సున్నం కలిపి గానుగ ఆడితే మంచి రకం బెల్లం తయారు చేయవచ్చునని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. జనవరి, ఫిబ్రవ రి నెలల్లో నాటిన తోటలను మళ్లీ అదే సమయానికి సకాలంలో నరికితే రసనాణ్యత బాగుండి నాణ్యమైన బెల్లం తయారయ్యే అవకాశం ఉందన్నారు. ఆలస్యంగా నాటితే దాని ప్రభావం బెల్లం తయారీపై ఉంటుందని తెలిపారు.ముక్క బెల్లానికి డిమాండ్, పెరుగుతున్న వినియోగం...
ముక్కబెల్లానికి కార్పొరేట్ రంగంలో రిటైల్ అవుట్‌లె ట్లలో, సూపర్బజార్లలో ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. సాధారణం గా వినియోగదారులు ఏదైనా ప్రయోజనం కోసం బెల్లాన్ని కొనుగోలు చేయవలసి వస్తే దిమ్మల రూపంలో కొనాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొనుగోలు చేసిన ఆ బెల్లం దిమ్మలో కొంత మాత్రమే ఉపయోగపడగా మిగతా బెల్లం వృధా అవుతోంది. దీంతో ఎక్కువ మొత్తం పట్టి బెల్లాన్ని కొన్న వినియోగదారులు నష్టపోతున్నారు. బెల్లం ఎంత పరిమాణంలో అవసరమో అంతే కొనుక్కునే విధంగా సౌలభ్యం లేకపోవడంతో ఈ పరిస్థితి మొన్నటి దాకా ఉంది. ప్రస్తుతం తక్కువ పరిమా ణం వున్న చిన్న బెల్లం దిమ్మలు, కిలో, అరకిలో బరువుండే బెల్లం ముక్కలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని తూర్పుగోదావరి జిల్లా రైతులు ఎక్కువగా తయారుచేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా రైతులు కూడా ఈ చిన్న పరిమా ణం వున్న ముక్కబెల్లం తయారీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. చెరుకు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వ్యవసాయ శాస్తవ్రేత్తలు బెల్లం పరి శ్రమ అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగం గా ఉత్తరాంధ్రలో బెల్లం అధికంగా తయారుచేసే ప్రాంతాల్లో ఆగ్రోప్రాసె సింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యా లయం సన్నాహాలు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో ఆగ్రోప్రాసెసింగ్ సెంటర్‌ను ప్రారంభిం చారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా విజయనగరం, శ్రీకాకు ళం జిల్లాలకు కూడా విస్తరించారు. బెల్లాన్ని ముక్క, పౌడర్, పాకం రూపంలో తయారుచేసి మార్కెటింగ్ చేయడమే ఈ ఆగ్రోప్రాసెసింగ్ సెంటర్ల ప్రధాన ఉద్దేశం. బెల్లాన్ని దిమ్మరూపంలో కాకుండా ముక్కరూపంలో తయారుచేసి అమ్మితే ఏటా రాష్ట్రంలోని బెల్లం రైతులకు కోట్లలో అదనపు ఆదాయం వస్తుం దని శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం కొన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టి అక్కడి బెల్లం రైతులు ముక్కబెల్లం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, మెదక్, నిజామాబాద్, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతులు బెల్లాన్ని వందగ్రాముల నుంచి వివిధ పరిమాణాల్లో తయారుచేసి అట్టపెట్టెలలో ప్యాకింగ్ చేస్తూ ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు.
కాగా విశాఖజిల్లాలోని రైతులను కూడా ఆ దిశగా మరల్చేందుకు శాస్తవ్రేత్తలు ప్రయత్నించారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముక్కబెల్లం, బెల్లం పౌడర్, బెల్లం పాకం తయా రీ యూనిట్లను ప్రయో గాత్మకంగా రూపొందించి దీనికి సంబం దించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ఇక్కడి ఆర్.ఎ.ఆర్.ఎస్‌లో అభివృద్ధి చేశారు. మునగపాక మండలంలో ప్రప్రథంగా ఈ ఆగ్రోప్రాసెసింగ్ సెంటర్‌ను ప్రారంభించి రైతులకు వాటిపై శిక్షణ ఇచ్చి, వారి చేత పరికరాలను కొనుగోలు చేయించి, బెల్లం తయారీ యూనిట్లను నెలకొ ల్పారు. మునగపాక మండలంలో ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ యూనిట్లను ఉపయోగిం చుకుని ముక్క బెల్లాన్ని తయారు చేయడం ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం వారు అందిం చిన పరికరాల ద్వారా ముక్కబెల్లాన్ని తయారుచేసి అమ్మడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని, ఈ విధానం ఎంతో సౌలభ్యకరంగా ఉందని పైప్రాంతాల నుం చి వినియోగదారులు ఇక్కడకు వచ్చి ముక్క బెల్లాన్ని కొనుగోలు చేస్తున్నారని, తిమ్మరాజు పేటకు చెందిన చెరుకు రైతులు సూరిశెట్టి ముసి లినాయుడు, శరగడం గోవింద, సూరిశెట్టి వెంక టి, నీటి సంఘం అధ్యక్షు లు భీమిశెట్టి నాయుడు తదితరులు తెలిపారు.
కష్టనష్టాలతో చెరుకు రైతు సావాసం... ఆర్థిక సాయం అందని ద్రాక్షే...
విశాఖ జిల్లాలో కౌలు రైతులకు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని కౌలు రైతులు కష్టాలతో సతమతమవుతున్నారు. ఈ ఏడాది వరుసగా సంభవించిన తుఫాన్లు, వరదలు, భారీ వర్షాల కారణంగా వీరంతా తీవ్రంగా నష్టాలు చవిచూశారు. వీరంతా పెద్ద కమతాలు ఉన్న భూస్వాముల వద్ద నుంచి పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తు న్నారు. పెరిగిన పెట్టుబడులు, పెరిగిన కూలీ రేట్లతో ఖర్చులు భారీగా అధి మై కౌలు చెల్లించలేని పరిస్థితులు రైతన్నకు దాపురించాయి. దీనికి వర్షాలు తోడవడంతో పంటలు పండక రైతులు వీధిన పడ్డారు. రాష్ట్రంలో చెరుకు సా గు విస్తీర్ణంలో ప్రథమస్థానం విశాఖ జిల్లాదే. ఇక్కడ నాలుగు సహకార చక్కెర కర్మాగారాలున్నాయి. జిల్లాలో సాధారణ చెరుకు సాగు విస్తీర్ణం 40,896 హెక్టార్లు కాగా ఈ ఏడాది 44,004 హెక్టార్లలో సాగు అయింది. చెరుకు విత్తనం, దుక్కులు, నాట్లు ఇతరత్రా పెట్టుబడులతో టన్ను చెరుకు ఉత్పత్తి చేయాలంటే రైతుకు 1600 రూపాయలకుపైగా ఖర్చవుతోంది. కుటుంబ మంతా రేయింబవళ్లు శ్రమించినా రైతుకు గిట్టుబాటు ధర రావడంలేదు. మదుపులు భారీగా పెరిగిపోయాయి.నష్టాలను చవి చూస్తున్నాం
గానుగాట ఆడేందుకు, బెల్లం తయారీ చేసుందుకు కూలీలు దొరకడంలేదు. కొంత మంది దొరికినా పెద్ద మొత్తంలో కూలీ రేట్లు డిమాండ్ చేస్తున్నారు. మగవారికి 200 రూపాయలు, ఆడవారికి 90 రూపాయలు రోజువారి కూలీ చెల్లిస్తున్నాం. పెట్టుబడులు, కూలీలకు చెల్లించింది పోనూ రైతుకు ఏమీ మిగలడం లేదు. దీంతో నష్టాలు చవిసూస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సరైన చెరుకు ఉత్పత్తి కాకపోవడంతో రసనాణ్యత తగ్గిపోతోంది. దీంతో నల్లబెల్లం తయారవుతోంది. దీనికి మార్కెట్లో డిమాండ్ లేని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. చెరుకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.- బొడ్డేడ రమణ (చెరుకు రైతు)
ఉపాధి హామీ పథకం అమలుతో కూలీలు దొరకడం లేదు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్క లు చేసుకున్నా నాలుగు డబ్బులు మిగలని దుస్థితి నెలకొంది. రైతుకు చెరుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదు. ఈ ఏడాది సెప్టెం బర్, నవంబర్ నెలల్లో జల్‌తుఫాన్, వర్షాలు, వరదల సమయంలో నష్టాలకు గురైన రైతన్న లకు ఇంతవరకూ ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ప్రభుత్వ అధికారులు పంట నష్టం పై సర్వేలు చేస్తున్నట్లు హడావుడే తప్ప రైతుకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఇదిలా ఉండగా తాజాగా వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా రైతు ల చేతికందిన పంట చేజారిపోయింది. నష్టపో యిన కౌలు రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతు న్నారు.
ఈ సమయంలో ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే ఏడాది రబీ పంట సాగు చేసేందుకు రైతులు సుముఖంగా లేరు. వ్యవసాయం పట్ల అనాసక్తత కనబరు స్తున్నారు. అనకాపల్లి, మునగపాక మండలా ల్లోని చెరుకు పంటపై ఆధారపడే రైతులు ఫ్యాక్టరీలకు చెరుకును సరఫరా చేసేందుకు వెనుకాడుతున్నారు. ఫ్యాక్టరీలు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం. గత ఏడాది పంచదార ధరలు బాగుండడంతో గోవాడ షుగర ్‌ఫ్యాక్టరీ 2,200, తాండవ, ఏటికొప్పాక షుగర్‌ఫ్యాక్టరీ లు 1800 రూపాయలు, తుమ్మపాల షుగర్‌ఫ్యాక్టరీ 1700 రూపాయలు రైతులకు మద్దతు ధరగా చెల్లించాయి. ఈ ఏడాది చక్కెర ధరలు తగ్గాయి. గత ఏడాది మాదిరి గా మద్దతు ధర చెల్లించడానికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు జంకుతున్నాయి. ఇప్పటికే చోడవరం షుగర్‌ఫ్యాక్టరీ, ఏటికొప్పాక షుగర్‌ఫ్యాక్టరీలు మద్దతు ధరను 1800 రూపాయలు ప్రకటించి, క్రషింగ్స్‌ను మొదలుపెట్టాయి. కాగా ఈ మద్దతు ధరపై నిన్నటి వరకూ ఒక నిర్ణయానికిరాని తుమ్మ పాల షుగర్‌ఫ్యాక్టరీ ఎట్టకేలకు స్పందించింది.
1700 రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్టు ఫ్యాక్టరీ చైర్మెన్ డి.ఆర్.డి.ఎ - పి.డి.శ్రీకాంత్ ప్రభాకర్ ఇటీవల ప్రకటించారు. ఈ మద్దతు ధర తమకు ఏ కోశానా సరిపోవడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తుమ్మపాల షుగర్‌ఫ్యాక్టరీ పరిధిలో బెల్లం గానుగలు, క్రషర్లు ఎక్కువగా ఉన్నాయి. చెరుకును ఫ్యాక్టరీకి తరలించేకంటే రైతే స్వయంగా బెల్లం గానుగాడుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరుకు పంట నీటమునిగిపోవడంతో చెరుకులో ఎదుగుదల లోపించింది. దిగుబడులు తగ్గిపోయాయి. చక్కెర శాతం పడిపోయింది. దీనికి తోడు అనకాపల్లి బెల్లం మార్కెట్ లో బెల్లం రేటు ఆశాజనకంగా లేకపోవడం రైతులను కుంగదీస్తోంది. గత ఏడాది మార్కెట్లో బెల్లం దిమ్మ ఖరీదు 325 రూపాయలు ధర పలకగా ప్రస్తుతం ఈ సీజన్లో 200 రూపాయలకు మించి ధర రావడంలేదు. దీంతో చెరుకు రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టా డుతున్నాడు. ఇదిలా ఉండగా నల్ల బెల్లం సమస్య రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరుకు తోటలు నీటమునిగి ఉన్నాయి. దీనికి తోడు చెరుకు రైతులు నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో విపరీతంగా నష్టపోతు న్నారు.
జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు గత ఏడాది 25,96,108 బెల్లం దిమ్మలు రైతుల ద్వారా దిగుమతి కాగా వాటిలో సగం నల్లబెల్లానికి చెందినవే. నల్ల బెల్లానిి, రంగుబెల్లానికి మధ్యధర వ్యత్యాసం ఎంతో ఉంది. మార్కెట్లో నలుపు, రంగు బెల్లం మధ్య ధర వ్యత్యాసం పదికిలోలకు 200 వరకు ఉంటుంది. ఈ కారణంగా నల్లబెల్లం తయారుచేసిన రైతులు తీవ్రంగా ధర విషయంలో నష్టపోతున్నారు. మార్కెట్లో రంగుబెల్లానిి డిమాండ్ ఉండడంతో నల్లబెల్లం వైపు ఎవరూ మొగ్గుచూపడం లేదు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. నల్లబెల్లానికి, రంగుబెల్లానికి మధ్య ధరవ్యత్యాసం వలన నల్లబెల్లం పంపిణీ చేసే రైతులు ఎకరాకు 20,000 వరకు నష్టపోవలసి వస్తోంది. నల్లబెల్లం తయారీ రైతు కావాలని తయారు చేయడం జరగదు. పండించే నేలలను బట్టి, ఎంచుకున్న రకాలను బట్టి బెల్లానికి ఈ రంగు వస్తుంది. చెరుకు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించక పోవడంతో బెల్లంలో నాణ్యత తగ్గి బెల్లం నలుపు రంగుకు మారుతోందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. బెల్లం తయారీ వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నష్టాలు చవిచూస్తున్నామని చెరుకు రైతులు చెబుతున్నారు.
ఏడాదికి రూ.100 కోట్ల వ్యాపారం...
జాతీయ స్థాయిలో పేరు పొందిన అనకాపల్లి మార్కెట్‌కు విశాఖ, శ్రీకాకుళం, విజయనగ రం జిల్లాలు నుంచి రైతులు బెల్లం తీసుకు వస్తారు. రైతులు తీసుకువచ్చిన బెల్లాన్ని యథావిధిగా ఇక్కడి వ్యాపార్లు అమ్మకాలు చేస్తారు. రకాలవారీగా పేర్చి, బహిరంగ వేలం నిర్వహిస్తారు. రోజుకు మార్కెట్‌కు 20,000 దిమ్మల నుంచి 25,000 దిమ్మల వరకు అమ్మకానికి వస్తున్నాయి. ఒక్కొక్క దిమ్మ బరువు 13 కిలోల నుంచి 16 కిలోల వరకు ఉంటుంది. ఏటా రూ.100 కోట్లకు పైగా వ్యాపారం సాగుతుంది. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒరిస్సా, బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది.ప్రభుత్వం ఆదుకోవాలి
కొన్నేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని చెరుకు సాగుచేస్తున్నాం. ఎకరానికి శిస్తు కింద 14,000 రూపాయలు కడుతున్నాం. ఈ ఏడాది ఒక ఎకరా దగ్గర పెట్టుబడి పోనూ తిరిగి 15 వేల రూపాయల నష్టం వాటిల్లింది. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాం. మార్కెట్లో బెల్లానికి సరైన ధర లేకపోవడం, ఫ్యాక్టరీ చెరుకు రైతుకు సరైన మద్దతు ధర ప్రకటించకపోవడంతో నష్టాలపాలవుతున్నాం. ప్రభుత్వం చెరుకు రైతులను ఆదు కోవాలి.- సూరిశెట్టి సన్యాసమ్మ (చెరుకు రైతు)
చిల్లిగవ్వ మిగలడం లేదు
గత ఏడాది ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయ లు లాభం వచ్చింది. గత సంవత్సవరం పది కేజీల దిమ్మ ఖరీదు 325 రూపా యలు ధర పలికిం ది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. బెల్లం ధర పడిపోయింది. పది కేజీల దిమ్మధర 210 నుంచి 220 రూపాయలు ప లుకుతోంది. పెట్టుబడి పోను చేతికి చిల్లిగవ్వ మిగలడంలేదు. - సూరిశెట్టి మహాలక్ష్మినాయుడు (చెరుకు రైతు, తిమ్మరాజుపేట)
వ్యవసాయం దండగ
వ్యవసాయం దండగ అనిపి స్తోంది. వృత్తి మీద అనాసక్తత పెరుగుతోంది. కష్టించి పని చేసినా ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రా వడం లేదు. నష్టాల ఊబిలో కూరుకు పోతు న్నాం. ప్రభుత్వం చెరుకు రైతులను ఆదుకోవాలి. - సూరిశెట్టి వెంకటసత్యనారాయణ (చెరుకు రైతు)
1 comment:
చక్కటి టపా
Post a Comment