పాడి పంటలు

ములక్కాడ లేదా మునగ

ములక్కాడ లేదా మునగ (తమిళం: முருங்கை) ఒక రకమైన చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. ఇది మొరింగా (Moringa) ప్రజాతిలో విస్తృతంగా పెంచే మొక్క. ఇది మొరింగేసి (Moringaceae) కుటుంబానికి చెందినది. ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి.
మునగ చెట్లు ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి పొడిగా ఉండే ఇసుక నేలలలో బాగా పెరిగినా, సముద్ర తీర ప్రాంతాలలో కూడా పెరుగుతాయి. ఇవి తొందరగా పెరిగి వర్షాభావాన్ని తట్టుకుంటాయి. వీటినిఆఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక, భారతదేశం, మెక్సికో, మలేషియా మరియు పిలిప్పైన్స్ దేశాలలో పెంచుతున్నారు. ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్లలో ఇది ఒకటి; దీనిలోని ప్రతీభాగం ఆహారంగాను లేదా ఇతర ప్రయోజనం కలిగివున్నాయి. మునగాకులను పశువులకు దాణాగా ఉపయోగిస్తారు.
మునగ
Moringa oleifera flower.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Rosids
వర్గము: Brassicales
కుటుంబము: మొరింగేసి
ప్రజాతి: మొరింగా
జాతి: ఎమ్. ఓలీఫెరా







ద్వినామము
మొరింగా ఓలీఫెరా
ఆఫ్రికాకు చెందిన సాంప్రదాయ ఆహారంలో మొరింగా ఆహార కొరతను తీర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడగలదు.
మునగ కాయలు (Drumsticks) చెట్టులో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగం. వీటిని భారతదేశంలో చిక్కుడు మాదిరిగా వండుకుంటారు. కొన్నిసార్లు మునగ గింజల్ని వేపుకొని తింటారు. మునగ పువ్వులు పుట్టగొడుగులాగా రుచికరంగా ఉంటాయి.

కలకత్తాలోని మునగాకులు.
మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో బీటా కెరోటీన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము మరియు పొటాషియం ఎక్కువగా కలిగివుంటాయి. ఆకుకూరలు క్రింద వీటిని వివిధ రకాలుగా వండుకుంటారు. ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ సాస్ ల లోనూ ఉపయోగిస్తారు. మురుంగకాయ్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగాకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

కలకత్తాలోని మునగ చెట్టు కాండం.
మొరింగా విత్తనాలు సుమారు 38–40% వంట నూనె ఉంటుంది (ఎక్కువగా బెహెనిక్ ఆమ్లం కలిగివుండటం వలన బెన్ నూనె అంటారు). ఈ నూనె వాసనలేకుండా, క్లియర్ గా ఉంటుంది. నూనె తీయగా వచ్చిన పిప్పిని ఎరువుగానూ, నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చును.
దీని చెట్టు బెరడు, వేర్లు, ఆకులు, విత్తనాలు, పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయక వైద్యవిధానాలలో ఉపయోగంలో ఉన్నాయి. జమైకా లో దీని కాండం నుండి నీలపు వర్ణకం తయారుచేస్తారు.
మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం. అక్కడ దీనిని sojne ful అని పిలుస్తారు. వీటిని పచ్చి శెనగలు మరియు బంగాళాదుంపలతో కలిపి వండుతారు.
మొరింగేసి
మొరింగేసి (Moringaceae) కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క ప్రజాతి మొరింగా (Moringa). ఈ ప్రజాతిలో 13 జాతులు ఉన్నవి; అన్నీ ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలంలో పెరిగే చెట్లు.
అన్నింటికన్నా ప్రసిద్ధిచెందిన "మొరింగా ఓలీఫెరా" (Moringa oleifera) బహుళ ప్రయోజనాలున్నమునగ చెట్లు భారతదేశంలో విస్తృతంగా పెరుగుతాయి. ఆఫ్రికా రకం (Moringa stenopetala) కూడా కొంచెం తక్కువగానైనా పెంచబడుతుంది.
మొరింగా చెట్లు పేదరికాన్ని మరియు ఆకలి దేశాల్లో బహుళ ప్రయోజనాలున్నవి. వీటి ఆకులు తొందరగా పెరిగి మనుషులకు మరియు పశువులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఆకులు మాంసకృత్తులు ఎక్కువగా కలిగివుంటాయి. పశువుల దానాగా ఉపయోగించినప్పుడు సోయా కంటే బలమైనవి మరియు పాల ఉత్పత్తిని పెంచేవిగా గుర్తించారు.

మొరింగా నుండి బయో ఇంధనం తయారుచేయవచ్చును. విత్తనాలలో 30-50% నూనె లభిస్తుంది, లేదా 112-185 gal/acre/year. నూనెలో 65-75% ఓలియక్ ఆమ్లం ఉంటుంది.
మొరింగా వర్షాభావ పరిస్థితులలో కూడా పెరుగుతుంది. భూసారం తక్కువగా ఉండే మెట్ట భూములలో (pH between 4.5 and 9) ను కూడా తట్టుకొంటుంది. ఇవి హిమాలయాల మంచుప్రాంతాలు, నారింజలు పెరిగే వాతావరణంలో పెరుగుతాయి.

ఆయుర్వేదంలో

ఆకుకూరలలో ప్రముఖమైనది మునగ. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు కాల్షియం పుష్కలంగా ఉంది.[2]
నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్కి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.
అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గితే మునగ పూలు, పాలలో వేసుకుని తాగాలి. ఇది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది.
మునగాకుతో ఆరోగ్యం...  
** మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

** మునగాకు కాడ నుంచి తీసిన రసాన్ని గాయాలకు రాస్తే యాంటి సెప్టిక్‌గా గాయాలను నయం చేస్తుంది.

** మునగాకు నూరి ఆ ముద్దను కురుపులపై కడితే అవి నయం అవుతాయి. చిన్న దెబ్బలకు, బెణుకులకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

** మునగాకు రసం, ఉప్పు కలిపిన రసం కొద్దిగా సేవిస్తూ ఉంటే అజీర్ణం తగ్గిపోతుంది.

** ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి, రోజూ నిద్రపోయే సమయంలో తాగితే రేచీకటి తగ్గిపోతుంది.

** ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనె కలిపి, దానిని ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి.

** మునగాకును పాలలో కాగపెట్టి, ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది.

** మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది.

** మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం వేసి తాగితే ఆకలి పుడుతుంది.




సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే మునగ




ఆకు కూరలలో ప్రముఖమైనది మునగ. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.


నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్కి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.


అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అంగస్తంభన సమర్థవంతంగా లేనివారు... మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది.


సెక్స్ సామర్థ్యం తగ్గిందనిపిస్తే... మునగ పూలు, పాలలో వేసుకుని తాగాలి. ఇది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది.

"మునగాకు చట్నీ"తో అజీర్తికి చెక్...!  

కావలసిన పదార్థాలు :
మునగాకులు... ఒక కప్పు
నూనె... రెండు టీ.
ఎండుమిర్చి... ఆరు
శెనగపప్పు... ఒక టీ.
మినప్పప్పు... ఒక టీ.
చింతపండు... నిమ్మకాయంత
ఉప్పు... తగినంత
కొబ్బరితురుము... రెండు టీ.
ఆవాలు... తగినన్ని
ఇంగువ... చిటికెడు

తయారీ విధానం :
పాన్‌లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు వేయించి తీయాలి. అదే పాన్‌లో మునగ ఆకును బాగా వేయించాలి. చల్లారిన మునగ ఆకు, వేయించిన ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఉప్పు, కొబ్బరి... అన్నీ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేయాలి. చివరగా పాన్‌లో మరో టీస్పూను నూనె వేసి ఆవాలు, ఇంగువతో పోపు పెట్టాలి. ఈ చట్నీ రొట్టెల్లోకీ, అన్నంలోకీ కూడా చాలా రుచిగా ఉంటుంది. 

మధుమేహం కలవారికి మునగ ఆకు  
మధుమేహంతో బాధపడేవారికి ఎండబెట్టిన మునగ ఆకు పొడిని తేనెతో కలిపి సేవించండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుందంటున్నారు వైద్యులు.

మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపిస్తే మునగాకు, క్యారెట్, దోసకాయల రసాన్ని మిశ్రమంగా కలుపుకోండి. ప్రతి రోజు ఓ గ్లాసు రసాన్ని సేవించండి. దీంతో మూత్రం పోసేటప్పుడు కలిగే మంట నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. 

మునగ సాగుకు అన్ని నూలలు అనుకూలమే

 

మునగ బహు వార్షిక కూరగాయలలో ఒకటి. పెరటి తోటల్లో పెంచబడే ఈ పంట, ప్రస్తుతం వాణిజ్యపరంగా పండించబడుతోంది. కాయలతోపాటుగా మునగ ఆకులు వైద్యపరంగా ఉపయోగించబడుతున్నాయి.

వాతావరణం: 20నుండి 25 సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న ప్రాం తాలు అనుకూలం. 40 సెల్సియస్‌ కంటె ఎక్కువ ఉష్ణోగ్రతలో పూత రాలిపోతుంది. మం చునూ, అధికచలినీ తట్టుకోలేదు.

నేలలు: అన్నిరకాల నేలలు అనుకూలం. అధిక సేంద్రియ పదార్ధాలతో కూడిన ఇసుక నేలలు శ్రేష్టం. నేల పి.హెచ్‌ 6నుండి 7.5 మధ్య ఉంటే మంచిది.




విత్తే సమయం: వార్షిక మునగ ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది. కాబట్టి ఆగస్టు, సెప్టెంబ రు నెలలలో గింజలను పాలిథిన్‌ సంచుల్లో గాని నేరుగా పొలంలో గాని విత్తుకోవాలి. బహువార్షిక రకాలలో కత్తిరింపులను జూన్‌ రెండవవారం నుండి ఆగస్టు చివరి వరకు భూమిలో నాటుకోవచ్చు.
రకాలు: దేశవాళీ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం మన రా ష్ట్రంలో జాఫ్నా పి.కె.ఎం1 రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి.
పి.కె.ఎం: వార్షికరకం, మొక్క 4నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి విత్తిన 160 నుండి 170 రోజులలో పూతకు వస్తుంది. కాయ పొడవు 65 నుండి 70 సెం.మీ. కాయల బ రువు 150 గ్రా. దిగుబడి మొ క్కకు 32 కిలోలు లేదా 200నుండి 225 కాయలు.
జాఫ్నా: బహువార్షిక రకం, కాయ పొడవు 60 నుండి 90 సెం.మీ. మెత్తని గుజ్జు. రుచికరంగా ఉంటుంది. రెండో సంవత్సరం నుండి కాపునకు వస్తుంది. దిగుబడి: మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి చెట్టుకు 80నుండి 90 కాయలను, నాల్గవ సంవత్సరం నుండి ఏడాదికి చెట్టుకు 500నుండి 600 కాయలను పొందవచ్చు.


నేల తయారీ: నేలను నాలుగైదు సార్లు దుక్కి వచ్చే వరకు దున్నాలి. బహువార్షిక రకాలకు 55 మీ. దూరం, ఏక వార్షిక రకాలైతే 2.52.5 మీ. దూరం ఉండాలి. గుంటల పరిమాణం 454545 సెంమీ ఉండాలి. ప్రతిగుంటకు పది కిలోల పశువుల ఎరువు 250 గ్రా. వేపపిండి, సూపర్‌ఫస్పేట్‌ వేయాలి.
వ్యాప్తి చేసే విధానం: బహు వార్షిక రకాలను 90నుండి వంద సెం.మీ పొడవు, 5.8 సెం.మీ మందం గల కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయవచ్చు. ఎకరానికి 160 కాండం ముక్కలు కావాలి. ఏక వార్షికాలను విత్తనాల ద్వారా వ్యాప్తి చెందించవచ్చు. (250 గ్రా. ఎకరాకు చొప్పున) గింజలను నేరుగా పొలంలో విత్తుకోవాలి. లేదా పాలిథిన్‌ సంచుల్లో విత్తి 15 నుండి 20 సెం.మీ యెత్తు పెరిగిన తర్వాత పొలంలో నాటుకోవచ్చు.
అంతర కృషి: మొక్కలు 60నుండి 75 సెం.మీ ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు త్రుంచివేయాలి.


ఎరువులు: గింజలు విత్తిన 3నెలలకు ఒక్కొక్క గుంటకు వంద గ్రా. యూరియా 50గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీటిని ఇవ్వాలి. మొక్కలకు ఆరునెలలకు ఒకసారి 9 నెలలకు మళ్లీ ఒకసారి వంద గ్రా. యూరియా, 50గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను వేసి నీరు కట్టాలి.
కోత కోయటం: బహువార్షిక రకాలు నాటిన 8 నుండి 9నెలలకు కాపునకు వస్తాయి. మొదటి పంట మార్చి నుండి జూన్‌ నెలల్లో, రెండవ పంట సెప్టెంబర్‌ అక్టోబర్‌ నెలల్లో వస్తుంది. పంట పెరిగినప్పుడు మొక్కకు ప్రతిసంవత్సరానికి 500నుండి 600 కాయల వరకు దిగుబడి వస్తుంది. ఏక వార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపుకొస్తాయి. ఫిబ్రవరిలో రకాన్ని బట్టి ప్రతిమొక్కకు మొదటి సంవత్సరం 150 నుండి 200 కాయలు, రెండవ సంవత్సరం 250 నుండి 400 కాయల దిగుబడి వస్తుంది. కాయలు కోసిన తర్వాత ఒక మీటరు ఎత్తులో కొమ్మలను కత్తిరించి కార్శి పంటను తీసుకోవచ్చు. ప్రతి కత్తిరింపునకు పైన చెప్పినట్టు ఎరువులను వాడావి. బహువార్షిక రకాలని ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేళాక తిరికి 10నుండి 12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తరింపు అవసరం లేదు. ఆ తర్వాత తోటలలో కొత్త మొక్కలను నాటుకోవాలి.


అన్ని రకాలనేలలు మునగ సాగుకు అనువు





హైదరాబాద్‌
దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహు వార్షిక కూరగాయలలో మునగ ఒకటి. పెరటి తోటల్లో పెంచబడే ఈ పంట, ప్రస్తుతం వాణిజ్యపరంగా పండించబడుతోంది. కాయలతోపాటుగా మునగ ఆకులు వైద్యపరంగా ఉపయోగించబడుతున్నాయి.
20నుండి 25 సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు అనుకూలం. 40 సెల్సియస్‌ కంటె ఎక్కువ ఉష్ణోగ్రతలో పూత రాలిపోతుంది. మంచునూ, అధికచలినీ తట్టుకోలేదు.
అన్నిరకాల నేలలు అనుకూలం. అధిక సేంద్రియ పదార్ధాలతో కూడిన ఇసుక నేలలు శ్రేష్టం. నేల పి.హెచ్‌ 6నుండి 7.5 మధ్య ఉంటే మంచిది.
విత్తే సమయం: వార్షిక మునగ ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది. కాబట్టి ఆగస్టు, సెప్టెంబరు నెలలలో గింజలను పాలిథిన్‌ సంచుల్లో గాని నేరుగా పొలంలో గాని విత్తుకోవాలి. బహువార్షిక రకాలలో కత్తిరింపులను జూన్‌ రెండవవారం నుండి ఆగస్టు చివరి వరకు భూమిలో నాటుకోవచ్చు.
రకాలు: దేశవాళీ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో జాఫ్నా పి.కె.ఎం-1 రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి.
పి.కె.ఎం: వార్షికరకం, మొక్క 4నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి విత్తిన 160 నుండి 170 రోజులలో పూతకు వస్తుంది. కాయ పొడవు 65 నుండి 70 సెం.మీ. కాయల బరువు 150 గ్రా. దిగుబడి మొక్కకు 32 కిలోలు లేదా 200నుండి 225 కాయలు.
జాఫ్నా : బహువార్షిక రకం, కాయ పొడవు 60 నుండి 90 సెం.మీ. మెత్తని గుజ్జు. రుచికరంగా ఉంటుంది. రెండో సంవత్సరం నుండి కాపునకు వస్తుంది. దిగుబడి: మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి చెట్టుకు 80నుండి 90 కాయలను, నాల్గవ సంవత్సరం నుండి ఏడాదికి చెట్టుకు 500నుండి 600 కాయలను పొందవచ్చు.
నేల తయారీ: నేలను నాలుగైదు సార్లు దుక్కి వచ్చే వరకు దున్నాలి. బహువార్షిక రకాలకు 55 మీ. దూరం, ఏక వార్షిక రకాలైతే 2.52.5 మీ. దూరం ఉండాలి. గుంటల పరిమాణం 4545ృ45 సెంమీ ఉండాలి. ప్రతిగుంటకు పది కిలోల పశువుల ఎరువు 250 గ్రా. వేపపిండి, సూపర్‌ఫస్పేట్‌ వేయాలి.
వ్యాప్తి చేసే విధానం: బహు వార్షిక రకాలను 90నుండి వంద సెం.మీ పొడవు, 5.8 సెం.మీ మందం గల కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయవచ్చు. ఎకరానికి 160 కాండం ముక్కలు కావాలి. ఏక వార్షికాలను విత్తనాల ద్వారా వ్యాప్తి చెందించవచ్చు. (250 గ్రా. ఎకరాకు చొప్పున) గింజలను నేరుగా పొలంలో విత్తుకోవాలి. లేదా పాలిథిన్‌ సంచుల్లో విత్తి 15 నుండి 20 సెం.మీ యెత్తు పెరిగిన తర్వాత పొలంలో నాటుకోవచ్చు.
అంతర కృషి: మొక్కలు 60నుండి 75 సెం.మీ ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు త్రుంచివేయాలి.
ఎరువులు: గింజలు విత్తిన 3నెలలకు ఒక్కొక్క గుంటకు వంద గ్రా. యూరియా 50గ్రా. మ్యూ
రేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీటిని ఇవ్వాలి. మొక్కలకు ఆరునెలలకు ఒకసారి 9 నెలలకు మళ్లీ ఒకసారి వంద గ్రా. యూరియా, 50గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను వేసి నీరు కట్టాలి.
కోత కోయటం: బహువార్షిక రకాలు నాటిన 8 నుండి 9నెలలకు కాపునకు వస్తాయి. మొదటి పంట మార్చి నుండి జూన్‌ నెలల్లో, రెండవ పంట సెప్టెంబర్‌- అక్టోబర్‌ నెలల్లో వస్తుంది. పంట పెరిగినప్పుడు మొక్కకు ప్రతిసంవత్సరానికి 500నుండి 600 కాయల వరకు దిగుబడి వస్తుంది. ఏక వార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపుకొస్తాయి. ఫిబ్రవరిలో రకాన్ని బట్టి ప్రతిమొక్కకు మొదటి సంవత్సరం 150 నుండి 200 కాయలు, రెండవ సంవత్సరం 250 నుండి 400 కాయల దిగుబడి వస్తుంది. కాయలు కోసిన తర్వాత ఒక మీటరు ఎత్తులో కొమ్మలను కత్తిరించి కార్శి పంటను తీసుకోవచ్చు. ప్రతి కత్తిరింపునకు పైన చెప్పినట్టు ఎరువులను వాడావి. బహువార్షిక రకాలని ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేళాక తిరికి 10నుండి 12 సంవత్సరాల వరకు ఎటువంటి కత్తరింపు అవసరం లేదు. ఆ తర్వాత తోటలలో కొత్త మొక్కలను నాటుకోవాలి.


సర్వరోగ నివారిణి.. అమృతపానీయం.. "మునగ"  
Health

* పిండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పీచుపదార్థాలు పుష్కళంగా ఉండే సర్వరోగ నివారిణి "మునగాకు". దీన్ని మెత్తగా నూరి, మరుగుతున్న నీటిలో వేసి, మూతపెట్టి ఐదు నిమిషాల తరువాత దించేయాలి. కాస్తంత చల్లారిన తరువాత వడగట్టి ఉప్పు, మిరియాలపొడి చేర్చి సూప్‌లాగా తీసుకోవచ్చు.

* మునగాకురసం, తేనె, కొబ్బరినీరు కలిపి చిన్న కప్పు చొప్పున ప్రతిరోజూ రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి. కామెర్లు ఉన్నవారు ప్రతిరోజూ చెంచాడు మునగాకు రసాన్ని, రెండు చెంచాల కొబ్బరినీటిలో కలిపి వారం రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.

* అధిక బరువు, మధుమేహం ఉన్నవారు ఎండబెట్టిన మునగాకుపొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. మునగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు కూడా మునగాకు రసం ఎంతగానో తోడ్పడుతుంది.

మునగ ఆకు

ఆషాడం వచ్చిందంటే చాలు. మునగ ఆకు కోసం ప్రయత్నిస్తుంటారు. అసలు ఆ సమయంలో మునగ ఆకు ఎందుకు స్వీకరిస్తారు.... దానివల్ల కలిగే మేలు ఏంటో చూద్దాము.
మునగ ఆకును ఒక్క ఆషాడం లోనే కాదు. ఏడాది పొడుగునా తీసుకొచ్చు. చిరు చేదుగా ఉంటే మునగ ఆకులో పిండి, కొవ్వు, పదార్దములు తక్కువగా , పీచు పదార్ధము ఎక్కువగా ఉంటుంది. ఎ, సి, విటమిన్లు , ఇనుము, క్యాల్సియం , పొటాషియం, తదితరాలు సంవృద్దిగా ఉంటాయి... అయితే ఈ కుర అరగడానికి రెండు గంటలు పడుతుంది. పచ్చి ఆకును శుబ్రంగా కడిగి రసం తీసుకొని స్వికరించ్చావచ్చు. సర్వరోగ నివారిణి. అమ్రుతపానీయం అనదగ్గ ఈ ఆకును ఎలా స్వీకరించాలంటే.....
మునగాకును మెత్తగా నూరి, మరుగుతున్న నీటిలో వేసి, మూత పెట్టి ఇదు నిమిషాలు తర్వాత దింపేయాలి. కాస్త చల్లారక వడకట్టి ఉప్పు , మిరియాల పొడి చేర్చి, సూపు లాగ తీసుకోచ్చు.

మునగాకు రసం , తేనె, కొబ్బరినీరు, కలిపి చిన్న కప్పు చొప్పున రోజు రెండు , మూడు సార్లు తీసుకుంటే నీళ్ళ విరేచనాలు , రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి.

కామెర్లు ఉన్నవారు చెంచా మునగాకు రసాన్ని, రెండు చెంచాల కొబ్బరినీటిలో కలిపి ఓ వారం పాటు క్రమం తప్పకుండ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.

కునగాకు రసంలో చిటికెడు ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి పరగడుపున పుచ్చుకుంటే బడలిక , జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి మునగాకు రసం తోడ్పడుతుంది.

నెలసరి సక్రమంగా రానివారు , కాల్సియం తగ్గినవారు చిన్న కప్పు పాలకు పెద్ద చెంచా మునగాకు రసం కలిపి రోజు తీసుకోవాలి.

మూత్రంలో మంట , ఉష్నతత్వం ఉన్నవారు మునగాకు .... క్యారెట్ దోసకాయలను రసంల చేసి రోజు ఓ గ్లాసు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

అధిక బరువు , మధుమేహం ఉన్నవారు ఎండాబెట్టిన మునగాకుపొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున రోజు భోజనానికి ముందు తీసుకోవాలి.

మునగాకు రసంలో చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.  
తలనొప్పి మానాలంటే : చెంచాడు మునగ ఆకు రసంలో మూడు మిరియాలు పొడి చేసి కలిపి కణతల మీద రాయాలి

జాగ్రతలు : మునగాకులను ఎక్కువగా తీసుకోకూడదు. వేడి చేస్తుంది.
విరుగుడు : పెరుగు, మజ్జిగ, వాము.

మునగ పూలు








మునగ అంటేనే మూతి ముడుచుకుంటే నష్టం..  Search 
similar articles


దక్షిణ భారతదేశంలో అతి తేలికగా అందరి పెరటి తోటల్లోనూ పెంచుకోగల, అధిక పోషకవిలువలు గల కాయలను అందిస్తున్న వృక్షం మునగ. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలియా ఫెరా. దీన్ని మదర్స్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటారు. మునగకాయను కేవలం సువాసనకు, రుచికి మాత్రమే మన వంటకాల్లో వాడుతుండటం మనకు తెలుసు.
అయితే మునగ చెట్టులో ఆకులు, కాయలు, పుష్పాలు, బెరడు వంటి పలు భాగాలు ఇటు మానవులకు, అటు జంతువులకు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. పోషక విలువలు అధికంగా కలిగిన ఈ మునగ చెట్టుతో సమాజానికి కలుగుతున్న ఉపయోగాల తీరుతెన్నులను మనం చూద్దామా.... ముఖ్యంగా రక్తలేమికి అతి తరచుగా గురవుతుండే మహిళలకు మునగ ఆకు, కాయ, పువ్వుతో చేసే కూరలు చాలా ఉపయోగపడతాయి.
మునగ కాయలు....
రోగనిరోధక వ్యవస్థను, చర్మాన్ని మునగ కాయలు గట్టిపరుస్తాయి. బలహీనపడ్డ ఎముకలను గట్టిపర్చి, రక్తహీనతను పోగొట్టి తల్లికి బిడ్డకు అవసరమైన పోషణను ఇవి అందిస్తాయి. రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులను అరికట్టడమే కాక తలపోటును నివారిస్తాయి.
రాయలసీమ పల్లెల్లో విరివిగా పండే ఈ మునగ కాయల సీజన్‌లో కాయలను పెద్ద మొత్తంలో ఉడికించి దానికి వేరుసెనగ పొడి చల్లి పేపుడుగా చేసి కుటుంబ సభ్యులకు పళ్లేల్లో కాయముక్కలను వడ్డించి తినిపిస్తారు. సాయంత్రం పూట టిఫన్ లేదా బజ్జీలకు బదులుగా మునగ కాయలను గృహిణులు ప్లేట్లలో పోసి వడ్డించేవారు. వేయించిన మునగ కాయ తోలు, గుజ్జు, గింజ అన్నీ పోషక విలువలు కలిగి ఉండేవే. పైగా ప్లేట్లోని కాయలు మిగుల్చకుండా తినే పద్ధతిని అలవాటు చేసేవారు.
ఈ కాలంలో లాగా సుతారంగా కూరలో ఉడికిన మునగకాయ గుజ్జును మాత్రం చేతితో తీసుకుని కాయను పారవేయడం కాకుండా కాయను పూర్తిగా నమిలి పిప్పి అయేంతవరకూ తింటే కాయలోని తోలుకుండే పోషక నిల్వలు శరీరానికి అందడమే గాక పంటి చిగుళ్లు గట్టిపడతాయి.
మునగ ఆకులు...
మునగ ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఇతర ఆకుకూరలు లభ్యంకాని డ్రై సీజన్‌లో కూడా ఇది లభ్యం కావడం విశేషం. ఈ ఆకుల్లో కొవ్వు పదార్ధాలూ, కార్బొహైడ్రేట్లూ తక్కువే గాని, ఖనిజాలు, ఐరన్, విటమిన్ బి వంటివి అధికంగా ఉంటాయి. ఆకులను ఆవిరిలో ఉడికించి వేరుశెనగ పొడి కలపి వేయించి అన్నంలో కూరగా గాని, వేపుడుగా కాని తింటుంటారు. మునగాకు అపాన వాయువును నిరోధిస్తుంది.
వీటి ఆకులతో అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను, డయేరియాను నివారించవచ్చు. తాజా ఆకులతో తయారు చేసిన కషాయం ఎక్కువ లోతుగా లేని గాయాలనుంచి వచ్చే రక్తస్రావాన్ని ఆపుతుంది. అలాగే ఆకులను నలిపి వంటపాత్రలు, నేల, గోడలు శుభ్రం చేయడానికి క్లీనింగ్ ఏజెంట్‌గా వాడవచ్చు. మునగాకులను మన పశువులకు ఆహారంగాను, చర్మ ఇన్‌ఫెక్షన్‌లకు యాస్ట్రింజెంట్‌గా కూడా ఉపయోగించవచ్చు. 



మునగ పూలు...
మునగ పుష్పాలను కూరగా, వేపుళ్లుగా చేసుకుని చాలామంది భుజిస్తుంటారు. వీటిపుష్పాలను కొంత సేపు నానబెట్టి జలుబు నివారణ ఔషధంగా కూడా వాడతారు. మునగ పుష్పాల రసం మూత్రకోశ, మూత్ర నాళాల సంబంధ సమస్యలను నివారిస్తుంది. మునగపూలలో లభించే టెరినో స్పెర్మిస్ అనే యాంటీ బయోటెక్‌ను ఫంగిసైడల్ సమ్మేళనంతో చర్మంపై ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌ల నివారణ చర్యల్లో వాడుతుంటారు.
మునగ గింజలు...
మునగ గింజల్లో ఆలివ్ ఆయిల్‌తో సమానమైన ఓలిక్ ఆమ్లం 75 శాతం దాకా లభిస్తుంది. ఈ ఆయిల్‌ను సబ్బులు, సుగంధ ద్రవ్యాల తయారీలో, వాచ్‌లలో కందెనగా కూడా ఉపయోగిస్తుంటారు. ఈ నూనె పులవదు, వేడి చేసినప్పుడు పొగ ఏర్పడదు.
మురికిగా ఉండే నదీ జలాలను శుభ్రపర్చడానికి వీటి గింజల పౌడరును వాడతారు. నీటిలోని బాక్టీరియాను కూడా ఈ గింజలను ఉపయోగించి తొలగించవచ్చు. అర్థరైటిస్, రుమాటిజం గౌట్ లైంగికంగా సంక్రమించే వ్యాధుల చికిత్సలో మునగ గింజలు ఎంతగానో ఉపకరిస్తాయి. మునగ గింజల కేక్‍‌లో అధికస్థాయి ప్రొటీన్‌లు ఉంటాయి. కనుక వ్యవసాయంలో మంచి ఎరువుగా ఇది ఉపయోగపడుతుంది.
మునగ జిగురు, బెరడు....
అలాగే మునగ చెట్టు జిగురును క్యాలికో ప్రింటింగులోనూ, ఔషధాల తయారీలోనూ తటస్థకారకంగా ఉపయోగిస్తారు. మునగ కలప గుజ్జునుంచి మంచి న్యూస్ ప్రింట్ కాగితాన్ని తయారు చేయవచ్చు. ఈ గుజ్జును బయోమాస్‌గా కూడా ఉపయోగించవచ్చు. మునగ బెరడు, గమ్‌ను తోలు పరిశ్రమల్లో చర్మాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉంటున్న మునగ చెట్టును నిర్లక్ష్యం చేయవద్దు. ఏ నేలలో అయినా సులువుగా పెరిగే మునగ చెట్టును ఇంటి పెరడులో నాటి పెంచుకోగలిగితే మూడు నెలలు అత్యంత పోషకవిలువలను మనం పొందవచ్చు. పైగా మునగాకును సంవత్సరమంతా వాడుకోవచ్చు కూడా. మహిళలకు, పిల్లలకే కాక మనుషులందరికీ బలవర్థమైన ఆహార విలువలను మునగ చెట్టుద్వారా పొందవచ్చు.
 మంచి ఆరోగ్యాన్నిచ్చే మునగ ఆకు

మనిషికి మంచి ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో ఆకుకూరలు ప్రత్యేక స్థానాన్ని కలిగివున్నాయి. మనకు అతి సులభంగా మార్కెట్‌లో దొరికే ఆకుకూరలతో సైతం మనము ఎనలేని లాభాలను పొందవచ్చు. ఈ వరుసలో వచ్చేదే మునగాకు.
మునగాకును ప్రతిరోజు తీసుకోవడం వలన వచ్చే లాభాలు అన్ని ఇన్ని కావు. ఈ ఆకును ఆహారంలోకి కూరగానో, లేక వేంపుడుగానో తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వలన రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.
మునగాకు వలన శరీరంలోని కొవ్వు పదార్థం తగ్గుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులను చాలా మంచిది. కంటి చూపు సవ్యంగా ఉండేందుకు మునగాకు బాగా సహకరిస్తుంది. ఈ ఆకును ఆహారంలో తీసుకోవడం వలన రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది.

                  Drumstick(మునగ కాడ)
Loading Image

మునగాకు ఎంతో మేలమ్మా!
munuga

మునక్కాయతో చేసిన ఏ వంటైనా చాలామంది ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి మంచివి కావడంతో ఎక్కువగా తింటుంటారు. అయితే మునగ కాయలతో పాటు ఆకులతోనూ కూరలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మాంసపుకృతులు దొరుకుతాయి. ఇవి ఆహారంగానే కాకుండా అనేక రుగ్మతలకు దివ్యౌషధంగా పనికొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో మునగాకు శరీరానికి మేలు చేసేదిగా చెప్పవచ్చును. తోటల్లో మునగ చెట్లు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పెరట్లో కూడా ఈ మొక్కను పెంచుతారు. ఆకును కూరగా వండుకుంటారుగాని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.
  • దీనిలో అధికంగా ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్నిస్తాయి.
  • మునగాకులో విటమిను - ఎ, విటమిన్‌ సి, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మాసంకృతులు కూడా ఉన్నాయి.
ఔషద గుణాలు ...
  • ముగన ఆకు రంసం, నిమ్మరంసం కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకొంటే మయస్సులో వచ్చే మొటిమలు నివారించబడతాయి. అందం పెరుగుతుంది.
  • మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
  • మునగాకు కాడ నుంచి తీసిన రసాన్ని గాయాలకు రాస్తే యాంటి సెప్టిక్‌గా గాయాలను నయం చేస్తుంది.
  • మునగాకు నూరి ఆ ముద్దను కురుపులపై కడితే అవి నయం అవుతాయి. చిన్న దెబ్బలకు, బెణుకులకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  • మునగాకు రసం, ఉప్పు కలిపిన రసం కొద్దిగా సేవిస్తూ ఉంటే అజీర్ణం తగ్గిపోతుంది.
  • ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి, రోజూ నిద్రపోయే సమయంలో తాగితే రేచీకటి తగ్గిపోతుంది.
  • ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనె కలిపి, దానిని ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి.
  • మునగాకును పాలలో కాసి కాగపెట్టి, ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది.
  • మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది.
  • మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం వేసి తాగితే ఆకలి పుడుతుంది.

మునగాకు చట్నీ

కావలసిన పదార్థాలు :

  • మునగాకులు. 1 కప్పు
  • నూనె. 2 టీస్పూ//.
  • ఎండుమిర్చి. 6
  • శెనగపప్పు. 1 టీస్పూ//.
  • మినప్పప్పు. 1 టీస్పూ//.
  • చింతపండు. నిమ్మకాయంత
  • ఉప్పు. తగినంత
  • కొబ్బరితురుము.2 టీస్పూ//.
  • ఆవాలు. తగినన్ని
  • ఇంగువ. చిటికెడు

తయారు చేయు విధానం :

  • బాణీలి లో టీస్పూను నూనె వేసి వేడిచేయాలి. ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు వేయించి తీయాలి.
  • అదే బాణీలి లో మునగ ఆకును బాగా వేయించాలి.
  • చల్లారిన మునగ ఆకు, వేయించిన ఎండుమిర్చి, సెనగపప్పు, మినప్పప్పు, చింతపండు, ఉప్పు, కొబ్బరి... అన్నీ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • చివరగా బాణీలి లో మరో టీస్పూను నూనె వేసి ఆవాలు, ఇంగువతో పోపు పెట్టాలి. ఈ చట్నీ రొట్టెల్లోకీ, అన్నంలోకీ కూడా చాలా రుచిగా ఉంటుంది.

మునక్కాయ తీపి పులుసు

కావలసిన పదార్థాలు :

  • మునక్కాయలు. 4
  • చింతపండు. 2 నిమ్మకాయలంత
  • వరిపిండి. 2 టీస్పూ//
  • బెల్లం. కాస్తంత
  • ఉప్పు. సరిపడా
  • పసుపు. చిటికెడు
  • కారంపొడి. 2 టీస్పూ//
  • మసాలాపొడి.4 టీస్పూ//

తయారు చేయు విధానం :

  • మునక్కాయలను కోసి పక్కన ఉంచాలి. చింతపండును రసంతీసి ఉంచాలి.
  • అందులో ఉప్పు, పసుపు, కారం, మునక్కాయ ముక్కలు వేసి ఉడికించాలి.
  • ఇవి ఉడికేటప్పుడే వరిపిండి, బెల్లం కూడా కలిపి ఉడికించాలి.

మునక్కాయ పప్పుచారు

కావలసిన పదార్థాలు :

  • మునక్కాయ.1
  • కందిపప్పు. 1 కప్పు
  • టొమోటో. 1
  • ఉల్లిపాయ. 1
  • పచ్చిమిర్చి. 2
  • మెంతిపొడి. 1 టీస్పూ//.
  • చింతపండు. కొద్దిగా
  • పసుపు. చిటికెడు

తయారు చేయు విధానం :

  • పప్పను విడిగా ఉడికించి మెత్తగా మెదిపి పక్కనుంచాలి.
  • మునక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలు చేసుకోవాలి.
  • చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలి.
  • మరో పాత్రలో పోపుపెట్టి దినుసులు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలు, మిర్చి ముక్కలు వేసి అవి వేగిన తరువాత అందులో చింతపండు రసం పోయాలి.
  • పులుసు మరిగేటప్పుడు మెంతిపొడి, మెదిపిన పప్పు వేసి కలిపి దించేయాలి.
  • అంతే వేడి వేడి మునక్కాయ పప్పుచారు సిద్ధం.
  • ఇందులో కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదా పోపులో కరివేపాకు వేస్తారు కాబట్టి మానేయనూ వచ్చు.
మునకాయ మసాల
Munakkaya 
Masala
కావలసిన పదార్ధాలు      
మునగ కాడలు - 3
కందిపప్పు - 1/2 cup
చెనిగి బాళ్ళు - 1/4 cup
లవంగము - 2
చెక్క - 1/2 peases
ఏలకలు - 2
అల్లం, వెల్లుల్లి పెస్ట్ - 2 tsp
జిలకర్ర -1 tsp
కారం - 1 tsp
ఉప్పు - రుచికి సరిపడ
ధనియాల పోడి - 1 tsp
పసుపు - చిటికెడు
చింతపండు - తగినంత
ఉల్లిపాయ -1
టమోటో - 2
ఆవాలు - 1 tsp
కొత్తిమిర - కొద్దిగా
ఆయిల్ - 2tbsp

తయారు చేయు విధానం
1. మొదట మునగకాడలను 3 ఇన్చ్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో కందిపప్పు, చెనగ బ్యాళ్ళు, జిలకర్ర వేసి వేసి వీటిని మిక్సిలో వేసి ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమిర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, కరివేపాకు, ముందుగా తయారు చేసుకొన్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ప్రై చేయాలి.
4. తర్వాత టమోటా ముక్కలను వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకొన్న మునగకాడలను వేసి కావలసినంత నీరు పోసి రెండు విజల్ కి దింపుకోవాలి. అంతే మునగకాడ మసాలా రెడీ.




హైదరాబాద్‌ (Wed, 12 May 2010) : నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను నట్టేట ముంచిన శ్రీకాంత్‌రెడ్డి సీడ్స్‌ ఎదుట మునగరైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. శ్రీకాంత్‌రెడ్డి సీడ్స్‌ యజమాని శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేయాలని, నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధిత రైతులు బుధ వారం హైదర్‌గూడలోని శ్రీకాంత్‌రెడ్డి సీడ్స్‌ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు బాధిత రైతులకు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో పాల్గొన్నారు. బాధిత రైతులు ధర్నా చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీడ్స్‌ దుకాణాన్ని సీజ్‌ చేయించారు. నష్టపరిహారం చెల్లిం చాలని, నకిలీ మునగ విత్తనాలు విక్రయించిన శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని అంటూ నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, బాధిత రైతులు ఎన్‌. రామచంద్రారెడ్డి, బి. నర్సింహారెడ్డి మాట్లా డుతూ రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం బాల్‌రెడ్డి గూడ గ్రామానికి చెందిన 28 మంది రైతులు హైదర్‌గూడ లోని శ్రీకాంత్‌రెడ్డి సీడ్స్‌ దుకాణంలో పదినెలల క్రితం మునగ విత్తనాలు కొనుగోలు చేశారని, వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 28 మంది రైతులు 30 ఎకరాల్లో మునగసాగు చేశారని, అయితే చెట్లు వేపుగా పెరిగాయి తప్ప పూతగానీ, కోతగాని రాలేదని, ఫలితంగా వేలాది రూపాయలు రైతులు నష్టపోయారన్నారు. సీడ్స్‌ కంపెనీపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నష్టపరిహారం చెల్లిస్తామని శ్రీకాంత్‌రెడ్డి సీడ్స్‌ యజమాని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. నష్టపరిహారం ఇవ్వాలని కోరితే మీ చేతనైంది. చేసుకోండి అన్న సమాధానం చెప్పాడని అన్నారు. ఒక్కొక్క రైతు 30 వేల రూపాయలు ఖర్చు చేశారని, లక్షన్నర నుంచి, రెండు లక్షల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. జైకిసాన్‌ నకిలీ విత్తనాల వల్ల ఒక్కొక్క రైతు రెండు లక్షల రూపాయల నష్టపోయారని, పరిహారం ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కాట్రగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ముప్పైమంది రైతులు పాల్గొన్నారు. రైతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, వ్యవసాయ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు.

Gouthamaraju as WUA