ప్రకృతి వ్యవసాయమే మిన్న
ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్యే కాదని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్
పాలేకర్ స్పష్టం చేశారు. రసాయనిక ఎరువులు, టన్నుల కొద్దీ వేస్తున్న పశువుల
ఎరువులతోనే కలుపు రైతులకు తీవ్ర సమస్యగా మారుతోందని అన్నారు. ‘పెట్టుబడి
లేని ప్రకృతి వ్యవసాయం’ అనే అంశంపై రెడ్‌హిల్స్‌లో సోమవారం రైతులకు
నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. సక్రమంగా ఆచ్ఛాదన కల్పించి, జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయన్నారు. జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరమన్నారు. మెట్ట పొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే.. భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పించవచ్చన్నారు.
ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదని, దేశీ లేదా నాటు ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవు లుంటాయని పాలేకర్ వివరించారు.
శిబిరంలో వ్యవసాయ శాఖ కమిషనర్
వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి పాలేకర్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఆయనతో చర్చించారు. కర్నాటక, కేరళ ప్రభుత్వాలు తన విధానాన్ని ఆమోదించి శిక్షణాశిబిరాలు నిర్వహిస్తున్నాయని, ఒక్కో రాష్ట్రంలో పది లక్షల మం ది ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని పాలేకర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.
మామిడి, సపోట పండిస్తున్నాను...
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ 150 ఎకరాల్లో మామిడి, సపోట వంటి అనేక పంట లు పండిస్తున్నాను. రెండేళ్లుగా మా పొలంలో పురుగుల మందు చల్లలేదు. ఎరువులు వేయలేదు. ‘జీవామృతం’ వాడుతున్నాను. రుచికరమైన దిగుబడి వస్తోంది. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతరపంటల ద్వారా ఆదాయం వస్తోంది.
- తిప్పేస్వామి, రాయదుర్గం, అనంతపురం జిల్లా
ఇథియోపియాలోనూ....
ఏడేళ్ల క్రితం పాలేకర్ పుస్తకం చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. అనేక అవార్డులు పొందాను. ఇథి యోపియా దేశానికి వెళ్లి గులాబీలు, కూరగాయలు, మొక్కజొన్న, చెరకు వంటి పంటలను పండిస్తున్నాను. కబేళాకు వెళుతున్న నాటు ఆవులను కొని సాగు ప్రారంభిం చాను. ఇథి యోపియాలో ‘బురానా’ జాతి ఆవు పేడ, మూత్రంతో కూడిన జీవామృతం అద్భుత ఫలితాలనిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీలకు బదులు రైతుకో ఆవు ఇస్తే మేలు జరుగుతుంది.
- జీవీ రాజు, ఎస్‌ఆర్ కండ్రిక, వైఎస్సార్ జిల్లా
No comments:
Post a Comment