ఒకప్పుడు విస్తృత సంఖ్యలో ఉన్న పుంగనూరు పశుజాతి సంఖ్య ప్రస్తుతం అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్రం మొత్తంమీద వీటి సంఖ్య 70. హైదరాబాద్‌లో ఇరవై వరకు ఉన్నాయి. ఎంపీ నందమూరి హరికృష్ణతో పాటు బంజారాహిల్స్‌కు చెందిన పొనుగోటి శ్రీనివాసరావు, ఎల్బీనగర్కు చెందిన నాగేశ్వరరావు, ఉప్పల్‌లో రామదాస్‌లతో పాటు నగర శివారులోని నర్సాపూర్ సువిజ్ఞాన ఆశ్రమంలో పుంగనూరు ఆవులను సంరక్షిస్తున్నారు. వీరితో పాటు నగరంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు, సినీనటులతో పాటు ఓ ఎమ్మెల్యే వద్ద కూడా ఈ ఆవులున్నాయి. ప్రస్తుతం పుంగనూరు ఆవు కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారు.
లీటరు పాల ధర.. వందల్లో...
పుంగనూరు ఆవులు అరుదైన పోషక విలువలతో కూడిన పాలను ఇస్తాయి. ఇందులో 10 నుంచి 12 శాతం వెన్న లభిస్తుంది. సాధారణంగా ఆవుపాలలో అత్యధిక వెన్నశాతం 4 మాత్రమే. ఏడాదిలో తొమ్మిది నెలల పాటు పాలిస్తాయి. ఈ పాలను ఆయుర్వేద ఔషధ తయారీలోనూ వాడుతుండటంతో లీటరు పాల ధర రూ.వందల్లో పలుకుతోంది.
ఇంటింటా.. సెంటిమెంట్...
పుంగనూరు ఆవు ఉండటం ఓ సెంటిమెంట్‌గా చాలామంది భావిస్తున్నారు. ఉదయం లేవగానే ఈ ఆవు మొహం చూసే ఇతర పనులు చేసే వీఐపీలున్నారు.
కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా...
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారిక సమీక్ష సమావేశాలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లేవాడ్ని. ఒక సారి వైఎస్సార్‌కు పుంగనూరు జాతి గురించి వివరించా. ఆయన సహకారంతో రెండు ఆవుల్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఉచితంగా పొందా. ప్రస్తుతం మా ఇంట్లో మూడు ఆవులున్నాయి. కుటుంబసభ్యులకంటే మిన్నగా పెంచుకుంటా. పోషణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. ప్రత్యేక షెడ్డు, రెండు ఫ్యాన్లు, దోమతెరలు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశా. పట్టణాల్లో పెంచుకోవడం చాలా సులువు.
-రాందాస్, బోడుప్పల్
ఎన్నో ఔషధగుణాలు...
పుంగనూరు జాతి ఈ ప్రాంతానికి, వాతావరణానికి ఎంతో అనువైంది. ఈ ఆవు పాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వివిధ సమస్యలపై మా ఆశ్రమానికి వ చ్చేవారికి పుంగనూరు ఆవుపాలతో కూడిన ఔషధాన్ని ఇస్తాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
- గురు సత్యవీర్,
సువిజ్ఞాన ఆశ్రమం, నర్సాపూర్
ఇష్టమనే పెంచుతున్నా...
పుంగనూరు పశువులంటే ఎంతో ప్రేమ. ఈ ఆవుల్ని పెంచితే అంతా మంచే జరుగుతుందన్న సెంటిమెంట్ ఉంది. ఈ జాతి ఆవులు మార్కెట్లో లేకపోవడం వల్ల పెంచుకోవాలనే ఇష్టపడే వారు రూ.లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
- ఉలిపెద్ది నాగేశ్వరరావు
ఎన్టీఆర్ హయాంలో...
ఆంధ్రప్రదేశ్‌లో పుంగనూ రు జాతి ఆవులు అంతరించిపోతున్నాయని 1983లో అప్పటి సీఎం నందమూరి తారకరామారావు ఈ జాతిని కాపాడాలని గుజ రాత్ నుంచి ఆవులను కొనుగోలు చేసి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులకు సబ్సిడీ ద్వారా అందజేశారు.
కృషి చేస్తా...
పుంగనూరు జాతి అంటే ఎంతో మక్కువ. వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వీటి పరిరక్షణకు కృషి చేస్తా.
- పొనుగోటి శ్రీనివాసరావు
1 comment:
మంచి సమాచారం అందుకున్న
Post a Comment