అధిక దిగుబడులు సాధించాలంటే పంటలకు ఎక్కువ నీటిని అందించాలన్న అభిప్రాయం చాలా మంది రైతుల్లో ఉంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పైర్లకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో నీరు అందించగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. దీనికి సూక్ష్మ సాగు నీటి విధానం (మైక్రో ఇరిగేషన్) ఎంతగానో ఉపయోగపడుతుంది. సూక్ష్మ సాగు నీటి విధానంలో రెండు పద్ధతులున్నారుు.
అవి 1.బిందు సేద్యం 2.తుంపర్ల సేద్యం. బిందు సేద్యానికి (డ్రిప్ ఇరిగేషన్) అవసరమైన పరికరాల్ని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల పథకం (ఏపీఎంఐపీ) ద్వారా ప్రభుత్వం 90 శాతం రాయితీతో అందిస్తోంది. అయితే రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వీటిని సమర్థవంతంగా వినియోగించుకోలేక పోతున్నారు. పరికరాలు దీర్ఘకాలం ఉపయోగపడాలంటే వాటిని సరైన రీతిలో సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యం లో డ్రిప్ పరికరాల నిర్వహణ, సంరక్షణకు సంబంధించి నల్గొండ ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ సహాయ అధికారి బాబు ‘న్యూస్‌లైన్’కు పలు విషయాలు తెలియ జేశారు. ఆ వివరాలు...
శాండ్ ఫిల్టర్‌ను ఇలా శుభ్రపరచాలి...
బావి నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు శాండ్ ఫిల్టర్‌ను అమరుస్తారు. ఇందులో ప్రత్యేకమైన ఇసుక ఉంటుంది. బావి నీటిని అందులోకి పంపించినప్పుడు నీటిలో ఏమైనా చెత్త, ఇతర వులినాలు ఉంటే అవి ఇసుకలోకి చేరి శుభ్రమైన నీరు మాత్రమే పైపుల ద్వారా మొక్కలకు అందుతుంది. ఇసుకలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించనట్లయితే నీటి ఒత్తిడి (ప్రెషర్) తగ్గుతుంది. అందువల్ల బిందు సేద్యానికి గుండె లాంటి శాండ్ ఫిల్టర్‌ను ప్రతి వారం శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఇసుకను చేతితో కలుపుతూ చెత్తను బయట పడేయాలి.
స్క్రీన్ ఫిల్టర్‌ను కూడా...
బోరు నీటి సౌకర్యం ఉన్న చోట బిందు సేద్య పరికరాలకు స్క్రీన్ ఫిల్టర్‌ను అమరుస్తారు. దీనిని ప్రతి రోజూ శుభ్రం చేయాలి. స్క్రీన్ ఫిల్టర్ మూత తెరిచి లోపల ఉన్న ఫిల్టర్ ఎలిమెంట్‌ను, సూక్ష్మ రంధ్రాలు ఉన్న స్టీల్ జాలీని శుభ్రపరచాలి. నీటి ధార కింద జాలీని ఉంచి మెత్తని బ్రష్‌తో రుద్దాలి.
పైపును ఎలా శుభ్రం చేయాలంటే...
శాండ్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ ఉన్నప్పటికీ సన్నని మట్టి కణాలు, ఇతర సేంద్రియ పదార్థాలు సబ్ మెయిన్ పీవీసీ పైపు వరకూ వస్తాయి. అక్కడి నుండి లాటరల్ ఇన్ లైన్ దిశగా వెళతాయి. వీటిని తొలగించడానికి సబ్ మెయిన్ పీవీసీ పైపు చివరి భాగంలో ఉండే ఫ్లష్ వాల్వ్‌లను వారానికో రోజు తెరవాలి. లోపల పేరుకున్న చెత్త, వులినాలు నీటి ప్రవాహంతో పాటు బయటికి వస్తారుు.
లాటరల్స్ మూసుకుపోతాయి...జాగ్రత్త
ట్యూబ్ లాటరల్స్‌ను శుభ్రం చేయకపోతే డ్రిప్పర్ల రంధ్రాల్లో మలినాలు పేరుకొని మూసుకుపోతాయి. లాటరల్స్‌ను శుభ్రం చేయడానికి పైపు చివర ఎండ్ క్యాప్ ఉంటుంది. దీనిని వారం లేదా 15 రోజులకు ఒకసారి తెరిచి పంపు ద్వారా పూర్తి ప్రెషర్ తో నీటిని లోపలికి పంపాలి. నీటి ప్రవాహం వేగంగా ఉంటే లాటరల్స్‌లో ఉన్న చెత్త నీటితో పాటే బయటికి వస్తుంది. వర్షాకాలంలో డ్రిప్ పరికరాలను పెద్దగా ఉపయోగించరు కనుక పైపులో సాలీళ్లు గూడు కట్టుకుంటాయి. అందువల్ల డ్రిప్‌ను తిరిగి వాడేటప్పుడు ముందుగా నీటిని పూర్తి ప్రవాహ వేగంతో వదలాలి.
ఇలా వాడుకోండి...
మోటారు ఆన్ చేసిన తర్వాత ఫిల్టర్ దగ్గర ఉన్న ప్రెషర్ గేజ్ సరిగా పని చేస్తున్నదో లేదో పరిశీలించాలి. గేజ్ మీటర్ పైన పాలిథిన్ కవర్ తొడగాలి. గేజ్‌లోని సూచిక పని చేయకపోతే నెమ్మదిగా తీసి సరి చేయాలి. నీటి వేగం సెకనుకు 1.5 మీటర్లు ఉంటేనే లాటరల్ పైపుకు నీరు అందుతుంది. మోటారు పంపు ఫుట్ వాల్వ్ దగ్గర వాచర్ పాడైనప్పుడు రైతులు అవగాహన లేక పేడ నీళ్లు ఉపయోగిస్తారు.
దీని వల్ల మోటారు ఆన్ చేసేటప్పుడు పేడ నీరు ఫిల్టర్‌లోకి చేరి దానిపై భారం పడుతుంది. దీనిని నివారించేందుకు బైపాస్ ద్వారా మురుగు నీటిని బయటికి పంపాలి. శాండ్ ఫిల్టర్‌లో తప్పనిసరిగా నాలుగింట మూడు వంతులు ఇసుక ఉండాలి. డ్రిప్పర్లను శుభ్రం చేయడానికి వాటిని లాటరల్ నుండి బయటికి తీయకూడదు. తెరిచి శుభ్రం చేయాలి. లాటరల్ నుండి డ్రిప్పర్లను బయటికి తీస్తే కన్నాలు పెద్దవై లీకేజీలు మొదలవుతాయి. ఉడతలు, ఎలుకల వంటివి లాటరల్స్‌కు నష్టం కలిగిస్తుంటే లాటరల్స్‌ను నేలలో మూడు నాలుగు అంగుళాల లోతుకు పరిచి మట్టి కప్పాలి.
డ్రిప్పర్లు పైకి ఉండేలా చూసుకోవాలి. నీటి కోసం పక్షులు లాటరల్స్‌ను కొరకకుండా అక్కడక్కడా నీటిని అందుబాటులో ఉంచాలి. డ్రిప్పర్ల చుట్టూ ఎంత మేరకు భూమి తడుస్తోందో తెలుసుకునేందుకు తరచుగా నేలను తవ్వి పరిశీలించాలి. లవణాలు, చెత్త పేరుకుపోయి డ్రిప్పర్లు మూసుకుపోతే ప్రతి ఆరు నెలలకు ఒకసారి యాసిడ్ ట్రీట్‌మెంట్ చేయాలి. వర్షాకాలంలో కూడా రోజూ కనీసం అరగంట పాటు మోటారు ఆన్ చేసి పరికరాలు పని చేసేలా చూసుకోవాలి.
ఏం చేయకూడదు?
డ్రిప్ పరికరాల్ని వాడాల్సిన అవసరం లేనప్పుడు వాటిని అలాగే తోటలో వదిలెయ్యకూడదు. చుట్టలుగా చుట్టి భద్రపరచుకోవాలి. పైపుల్ని అలాగే ఉంచి చేలో చెత్తను కాల్చకూడదు. యాసిడ్ ద్రావణం తయారు చేసేందుకు యాసిడ్‌ను నీటిలో పోయాలే తప్ప నీటిని యాసిడ్‌లో పోయకూడదు. ఫిల్టర్‌లో జాలీ లేకుండా పరికరాల్ని పని చేయించకూడదు. ఫిల్టర్‌లోని జాలీని శుభ్రం చేయడానికి పదునైన వస్తువులు, పుల్లలు, ఇనుప బ్రష్‌లు వాడకూడదు. లాటరల్ పైపును బలంగా లాగకూడదు. డ్రిప్ పరికరాల ద్వారా అవసరమైన మేరకే చెట్లకు నీరు అందించాలి. అవసరానికి మించి ఎక్కువగా నీరు పెడితే పల్లాకు తెగులు వచ్చే ప్రమాదం ఉంది.

No comments:
Post a Comment