గోల్డెన్‌రైస్ గోప్పేమీటీ..?
గోల్డెన్ రైస్ అంటే బంగారపు బియ్యం అని కాదు కానీ బంగారు వర్ణంలో ఉన్న బియ్యం. ప్రస్తుతం మనం తింటున్న బియ్యం వల్ల తలెత్తుతున్న పోషకాహార లోపాలు, కంటి సమస్యలను అధిగమించే లక్ష్యంతో ఈ గోల్డెన్ రైస్‌కు అంకురార్పణ జరిగింది. జన్యుమార్పిడి విధానం ద్వారా తయారయ్యే గోల్డెన్‌రైస్ వర్ధమాన దేశాలకు వరం అని కొందరు చెబుతుంటే, ఆ బియ్యం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని వందన శివ వంటి ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరి దృష్టిని ఆకర్షిస్తున్న గోల్డెన్‌రైస్ విశేషాలు. పంచవ్యాప్తంగా వరి పంటపై జరుగుతున్న పరిశోధనల్లో గోల్డెన్ రైస్ ఒక కీలకమైన మలుపు.
వరి మొక్కలోకి విటమిన్ 'ఎ' మూల కారకం 'బీటాకెరోటిన్'ను సొంతంగా తయారు చేసుకోవటానికి అవసరమయ్యే జన్యువును ప్రవేశ పెట్టి, తయారు చేసిన వరి వంగడమే గోల్డెన్ రైస్. వరి సాధారణంగా 'బీటాకెరోటిన్'ను సొంతంగా తయారు చేసుకోలేదు. దీని వల్ల వరిని ప్రధాన ఆహారంగా తీసుకునే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విటమిన్ 'ఎ' లోపం కనిపిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విటమిన్ 'ఎ' లోపం వల్ల ప్రజలు పలు రుగ్మతలకు లోనవుతున్నారు. విటమిన్ 'ఎ' లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది పిల్లలు అంధత్వానికి గురవుతున్నారని సర్వేలో తేలింది. అదనంగా ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షల మంది పోషకాహార లోపం వల్ల మరణిస్తున్నారు.
లోపాన్ని అధిగమించడమే లక్ష్యం
వరి ప్రధాన ఆహారంగా ఉన్న ప్రజల్లో కొన్ని ఆరోగ్య సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తించారు. విటమిన్ 'ఎ' లోపం పలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నది. ఈ సమస్యను అధిగమించడం ఎలా అని శాస్త్రవేత్తలు ఆలోచించారు. మనం తీసుకొనే ఆహారాన్నే ఈ లోపాన్ని అధిగమించే రీతిలో తయారు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు.
ఆ ఆలోచన ఫలితమే గోల్డెన్‌రైస్. స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జ్యూరిచ్, స్విట్జర్లాండుకు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఇంగో పోట్రికస్, సెంటర్ ఫర్ అప్లైడ్ బయోసైన్సెస్, ఫ్రీబర్గ్ యూనివర్శిటీ, జర్మనీకి చెందిన డాక్టర్ పీటర్‌బేయర్‌లు 1982వ సంవత్సరంలో రాక్‌ఫిల్లర్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో గోల్డెన్‌రైస్‌పై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. శాస్త్రవేత్తలు ప్రాథమికంగా జపానికా వర్గానికి చెందిన తైసీర300 వరి మొక్కలోకి డఫోడిల్ మొక్క, నేలలో జీవించే 'ఎరివీనియా' బ్యాక్టీరియాల నుంచి సేకరించిన జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా 1999 వ సంవత్సరం ఆగస్టు నెలలో గోల్డెన్ రైస్ తయారీ ప్రక్రియలో మొట్టమొదటి సారి విజయం సాధించారు.

మనం తీసుకునే రైస్‌లోని నాలుగు యూనిట్ల బీటాకెరోటిన్ శరీరంలో ఒక యూనిట్ విటమిన్ 'ఎ' గా మార్పు చెందుతుందని కనుగొన్నారు. ఒక గ్రాము గోల్డెన్‌రైస్‌లో దాదాపు35 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుందని పరిశోధకులు తేల్చారు. అప్పటి నుంచి దీనిపై ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఈ రైస్ ఆవిష్కరణ కొత్త ఆలోచనలకు ఆజ్యం పోయటంతోపాటు బయోటెక్నాలజీ ఆధారిత పరిశోధనలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.
వివిధ దేశాలకు చెందిన నిపుణుల బృందం 2001వ సంవత్సరంలో ఫిలిఫ్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారంతో గోల్డెన్ రైస్ సామర్థ్యం, ఆహార పౌష్టికత, పర్యవసానాలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. నిరుపేద దేశాల్లో పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్న శిశువుల పాలిట గోల్డెన్ రైస్ ఒక వరంగా ఉపయోగపడుతుందని నిర్ధారించారు. విటమిన్ 'ఎ' లోపాన్ని సవరించటంతోపాటు ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ ఆధారిత పరిశోధనలపై ఉన్న అపోహలను తొలిగించేందుకు కూడా గోల్డెన్‌రైస్ దోహదం చేసింది.
మానవీయ కోణం
గోల్డెన్ రైస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఇంగోపోట్రికస్, డాక్టర్ పీటర్‌బేయర్‌లు దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని, మేథోసంపత్తి హక్కులను పేద దేశాలతో ఉచితంగా పంచుకునేందుకు ముందుకు వచ్చారు. తద్వారా శాస్త్ర పరిశోధనలకు మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. ఫలితంగా భారతదేశంతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో గోల్డెన్ రైస్‌పై పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. దీంతో అమెరికాలోని సింజెంటా అనే మల్టీ నేషనల్ కంపెనీ గోల్డెన్ రైస్-2 ను విడుదల చేసింది.
అమెరికాలో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో గోల్డెన్ రైస్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కీబోనెట్ వరి రకంలో మొక్కజొన్నలో ఉన్న జన్యువులను అదనంగా ప్రవేశ పెట్టడం ద్వారా గోల్డెన్‌రైస్-2కు రూపకల్పన చేశారు. ఈ బియ్యం బంగారువర్ణంలో ఉంటుంది. గోల్డెన్ రైస్-1 కంటే 2లో అ«ధికంగా బీటాకెరోటిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక గ్రాము గోల్డెన్ రైస్‌లో 36.7 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
పరిశోధనలు మునుముందుకు
గోల్డెన్‌రైస్1, 2 రకాలను ప్రపంచ శాస్త్రవేత్తలు వెలువరించిన నేపథ్యంలో భారతదేశంలోనూ దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అంధత్వాన్ని నివారించేందుకు వీలుగా భారతదేశంలో అందుబాటులో ఉన్న వరి వంగడాల్లో గోల్డెన్ రైస్ ను తయారుచేసే జన్యువును చొప్పించేందుకు పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో 40లక్షల హెక్టార్లలో ఈ గోల్డెన్ రైస్‌ను 1212 సంవత్సరాంతానికల్లా పండించాలనేలక్ష్యంతో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.
దేశంలో లభ్యమవుతున్న స్వర్ణ, ఎంటియూ1010. ఏడీటీ 43 వరి వంగడాల్లో బీటాకెరోటిన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా గోల్డెన్ రైస్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇంటర్నేషనల్ రైస్‌రీసెర్చ్ సహకారంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, రైస్ రీసెర్చ్ డైరెక్టరేట్‌ల ఆధ్వర్యంలో గోల్డెన్‌రైస్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
దీంతోపాటు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్నాటక వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోనూ దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రధానంగా ఫిలిఫ్పైన్స్, బంగ్లాదేశ్, భారతదేశాలు గోల్డెన్‌రైస్‌పై పరిశోధనలపై దృష్టి సారించాయి. శాస్త్రవేత్తలు పరిశోధనల్లో ముందడుగు వేస్తున్న నేపథ్యంలో గోల్డెన్ రైస్ మనకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయంటున్నారు.
గోల్డెన్‌లో నిజమెంత?
గోల్డెన్ రైస్ రాకతో భవిష్యత్తులో విటమిన్'ఎ' లోపం నివారణతోపాటు అంధత్వం సమస్యలు తొలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే సామాజిక ఉద్యమకారులు మాత్రం గోల్డెన్ రైస్‌లో పరిశోధకులు చెబుతున్నంత విటమిన్-ఎ లేనే లేదని వాదిస్తున్నారు. గోల్డెన్ రైస్‌ను వండిన తరువాత అందులో విటమిన్-ఎ ఎంతవరకు ఉంటుందనే అంశంపై ఖచ్చితమైన లెక్కలు లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తున్నది. వరిలో జన్యుమార్పిడి పంటను అనుమతిస్తే ఈరకమైన పంటల వెల్లువ ప్రపంచాన్ని ముంచెత్తుతుందని, ఇది పర్యావరణానికి ఏ మాత్రం మంచిది కాదని గ్రీన్‌పీస్ సంస్థ హెచ్చరిస్తున్నది.
ప్రస్తుతం ఉన్న వరిపంటలో ఉన్న లోపాల్ని వేరే మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సింది బదులు జన్యుమార్పిడి పంటలు నెత్తికెత్తుకోవడం సమర్థనీయం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఫ్రాన్సిస్కో బ్రాంకా అభిప్రాయపడ్డారు. గోల్డెన్‌రైస్‌పై మనదేశంలో జోరుగా సాగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వస్తాయా? ఆ బియ్యం ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అవి ఎంత వరకు ప్రస్తుత బియ్యానికి ప్రత్యామ్నాయం అవుతాయనేవి శేషప్రశ్నలే!