గడచిన పదేళ్లలో బియ్యం ధర మూడింతలైంది. పప్పులూ కొండెక్కి కూచున్నాయి.
అంతగా ధరలు పెరిగినప్పుడు వాటిని పండించే రైతులు ఈ పదేళ్లలో
లక్షాధికారులై ఉండాలి కదా. అలా జరగకపోగా వాళ్ల స్థితిగతులు నానాటికీ
తీసికట్టుగా ఎందుకు తయారవుతున్నట్టు? ప్రతిరోజూ వార్తల్లో రైతు ఆత్మహత్యల
సంఖ్య ఎందుకు పెరుగుతున్నట్టు? ఇలా ఆలోచించి వ్యవసాయాన్ని లాభసాటి ఉపాధిగా
తయారుచెయ్యడానికి కంకణం కట్టుకున్నారు ముగ్గురు యువకులు. మూడేళ్ల క్రితం
వాళ్లు స్థాపించిన 'గ్రీన్‌బేసిక్స్' సంస్థ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో
వందల ఎకరాల్లో సిరుల పంటలు పండిస్తోంది. రైతులకు ఆలంబనగా ఉంటోంది.
ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి రమణబాబు, ప్రేమ్‌సాగర్‌రాజు, ఒడిశాకు చెందిన
మదన్మోహన్ - ముగ్గురూ వ్యవసాయంలో పట్టభద్రులే. ముగ్గురివీ గ్రామీణ
నేపథ్యాలే కావడంతో, వ్యవసాయాన్ని దండగలా కాకుండా పండగలా చెయ్యాలనే ఆలోచన
వారికి ముందునుంచీ ఉండేది. అనుకోకుండా ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్
సోషల్ సైన్సెస్ (టిస్)లో విద్యార్థులుగా కలిసిన వీరు 'విత్తనాల చల్లడం
మొదలు కోతల వరకు' రైతుకు సాంకేతిక సాయం అందేలా ఒక వినూత్నమైన వ్యాపార
ఆలోచనను కాగితాలమీదికెక్కించారు. దీని ద్వారా ఆదాయం పొందుతూనే రైతులకు
వ్యవసాయం గిట్టుబాటయ్యేలా చేస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
నిర్వహించిన 'ఐడియా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్' పోటీల్లో జాతీయ స్థాయి
విజేతగా నిలవడంతో అది బాగా ప్రాచుర్యం పొందింది. ఐదేళ్ల క్రితం సంగతిది.
రెండేళ్ల హోమ్‌వర్క్ తర్వాత అదే 'గ్రీన్‌బేసిక్స్' సంస్థగా ప్రాణం
పోసుకుంది.
సేవ చేస్తాం, విస్తరిస్తాం
పాతిక లక్షల పెట్టుబడితో నోటి మాటే ప్రచారంగా పొలం పనుల్లోకి దిగింది
'గ్రీన్ బేసిక్స్'. రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి
వాటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల
సాయంతో వాటిని పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా
రైతులకొచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను
లాభసాటిగా అమ్ముకొనే పద్ధతులనూ సూచిస్తుంది. "వ్యవసాయాన్ని వ్యవస్థీకృత
పరిశ్రమగా రూపొందించాలి.
ప్రతి రైతూ అందులో భాగస్వామి కావాలి,
అందుబాటులో ఉన్న వనరులనే మరింత సమర్థంగా ఉపయోగించుకుంటూ అధిక దిగుబడులను,
లాభాలను పొందాలి. ఇదే మా గ్రీన్ బేసిక్స్ దృక్పథం. రైతు సమస్యలకు
సమగ్రమైన పరిష్కారాలను రూపొందించడమే మా లక్ష్యం'' అంటున్నారు
వ్యవస్థాపకుల్లో ఒకరైన రమణబాబు. ప్రస్తుతానికి గ్రీన్‌బేసిక్స్ సేవలు మన
రాష్ట్రంలో వరి పండించే రైతులకే పరిమితం. వీరి సేవల వల్ల రైతులకు
విత్తనాల కోసం పడిగాపులు పడటం, కూలీల కోసం ఎదురుచూడటమనే బాధలు
తప్పుతున్నాయి.
దిగుబడిలో ఇరవై శాతం దాకా పెరుగుదల కనిపిస్తోంది.
ఇప్పటి వరకూ గ్రీన్‌బేసిక్స్ దాదాపు ఐదొందల ఎకరాల్లో 300 మంది రైతులతో
కలిసి పనిచేసింది. 2500 మంది రైతులకు మేలురకం విత్తనాల ఉత్పత్తిలో
శిక్షణనిచ్చింది. నలభై గ్రామాల్లో నాబార్డ్ నెలకొల్పిన రైతు క్లబ్బులకు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకునేలా తర్ఫీదిచ్చింది. వచ్చే
సీజన్లో మరింతమంది రైతులకు అందుబాటులో ఉండటానికి ఈ బృందం కృషి చేస్తోంది.
పేదల ఉపాధా - పెద్దల హాబీనా?
విమర్శలను పక్కకు పెట్టి వాస్తవాలను పరిశీలిస్తే, ఇప్పటి తరాలకు సైతం మట్టి
పట్ల అనుబంధం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలోనో, మరోచోటో చేరి, మంచి సంపాదన
మొదలవగానే వ్యవసాయ భూమి కొద్దిగానైనా కొనుక్కోవాలని ఆశపడుతున్న యువత
బోలెడుమంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు సైతం పుట్టినూరికి దగ్గరగా
పంటపొలాలు కొనుగోలు చేస్తున్నారు. దీనికి భిన్నంగా గ్రామాల్లో వ్యవసాయ
కుటుంబాల్లో పుట్టిపెరుగుతున్నవారు మాత్రం పొలం పనికి సిద్ధంగా లేరు.
వ్యవసాయం పట్ల వారిలో ఆసక్తి లేదు.
ఆరుగాలం కష్టిస్తే శ్రమకు తగ్గ
ప్రతిఫలం అందుతుందనే భరోసా లేదు. "ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇదిలాగే
కొనసాగుతూ పోతే మన దేశంలో వ్యవసాయం అధిక శాతం ప్రజల జీవనోపాధిగా కాకుండా
సంపన్న వర్గాల హాబీగా అయిపోతుంది. యువత నడుంకట్టి పొలం పనుల్లో దిగకపోతే
తిండి దొరకని రోజులు దగ్గర్లోనే ఉన్నాయి...'' అని ప్రమాద ఘంటికలు
మోగిస్తున్న గ్రీన్ బేసిక్స్ బృందం "సంప్రదాయ విధానాలకు అత్యాధునిక
సాంకేతికతను జోడిస్తేనే వ్యవసాయం గిట్టుబాటవుతుంది, లాభాల పంటను
పండిస్తుంది'' అని ధైర్యం చెబుతున్నారు. వాళ్ల కృషి ఫలితాలు శ్రీకాకుళం
జిల్లాలో వందల ఎకరాల్లో కనిపిస్తున్నాయి.
కొండంత కష్టం - అదే ఇష్టం
"ఆహారోత్పత్తిలో ఎదురవబోతున్న విపత్కర పరిస్థితుల గురించి ఎవరికీ అవగాహన
ఉండటం లేదు. పెరుగుతున్న జనాభా కారణంగా వ్యవసాయ భూముల విస్తీర్ణం
తగ్గిపోతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటం లేదు.
ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేవు. ఇవన్నీ కలిసి వ్యవసాయ రంగాన్ని ప్రమాదకర
మైన పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా మేలుకోకపోతే వినాశనం
తప్పదు...''
అని కాసింత సీరియస్‌గానే చెబుతున్న రమణబాబు ఒడిశాలోని
సెంచూరియన్ యూనివర్సిటీలో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అగ్రిబిజినెస్ వంటి
అంశాలమీద క్లాసులు కూడా బోధిస్తుంటారు.
"పాఠాలైతే సులువుగా
చెప్పొచ్చుగానీ, ఆచరణలో అవన్నీ ఎంత కష్టమో నాకు స్వయంగా తెలుసు. చిన్న
కమతాల మీద ఆధార పడి వ్యవసాయాన్ని లాభసాటిగా కొనసాగించడం లోని కష్టం మాటల్లో
చెప్పలేనిది'' అంటున్నాడీ యువకుడు. ఆ కష్టాన్ని సులువు చెయ్యడాన్ని
ఇష్టంగా స్వీకరించిన 'గ్రీన్‌బేసిక్స్' వంటి బృందాలు మరిన్ని తయారయితే
రైతులకు అంతకంటే ఆనందకరమైన విషయం ఇంకేముంటుంది?
"రైతుకు శ్రమ లేకుండా నాణ్యమైన విత్తనాలను సేకరించి వాటిని ముందుగానే
సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేల్లో నారు పొయ్యడం, యంత్రాల సాయంతో వాటిని
పొలంలో నాటడం వంటివి చేస్తుందీ బృందం. పంట కోతకొచ్చేదాకా రైతులకొచ్చే
సమస్యలన్నిటికీ పరిష్కారాలను చూపించడంతో పాటు, పంటను లాభసాటిగా అమ్ముకొనే
పద్ధతులనూ సూచిస్తుంది.''
|
Green Basics is focused on formulating and implementing
sustainable integrated agriculture farming systems. We at
Green Basics strongly believe partnering the farmer in the
postharvest processes and value addition immensely influences
and immediately transforms farmers both qualitatively and
economically, for which we suggest an alternative model
to make farmer as stake holder and bringing total supply
chain under one roof through our leadership.
|
|
|
GB
on the field, providing extension services to farmers
|
|
|
The
business model includes convenient dissemination of extension
services, mechanization leading to high productivity and
quality of international standards, to meet and compete
with the global agriculture market. We also believe that
mechanization of agriculture system is inevitable in near
future as the present labor problem, inefficient farm
practices result in qualitative and quantitative decline
in farm output.
|
|
|
|
Ramana
Babu Killi
Project Manager
ramanakilli@yahoo.co.in
08099152315
Receiving ISB-idiya trophy from Deputy
P.M of Thailand in ISB,Hyderabad
|
Ramana is Masters in Social Entrepreneurship graduate from
Tata Institute of social Sciences, Mumbai and received “GOLD
MEDAL” for best student and highest grade point for batch
of 2007-09, having two years experience in the field of
Agriculture. He worked in Zameen organic Pvt. Ltd and AOFG,
India as a Regional Manager for Andhra Region.
His
expertise will help in maintain the small farmer’s organization
and networking with social enterprises and funding agencies
|
|
|
|
Mr.
Madan Mohoan
Operations Manager
genemadan@gamil.com
094401159468
Mr.Madan Mohan
|
|
Madan Mohan completed his PG in Genetics from Bidhana
Chandra Krishi Viswava vidhyalaya (BCKV), west Bengal,
and worked as a senior research fellow in Directorate
of Oil Research (DOR) &International crop research
institute for semi arid tropics (ICRISAT) and also
trained in agriculture related activities. His technical
expertise helps in identifying high yielding verity
seeds and quality control.
|
|
|
|
|
Mr.
A. Prem Sagar Raju
Communication’s
manager
Mr.
A. Prem Sagar Raju
|
|
Prem has a master’s degree in Social Entrepreneurship from
TISS, and was awarded the Gold Medal for best field work
performance. He was an operations manager for FINO and has
worked on several rural Financial Inclusion project involving
both private and government clients. In his most recent
role, he was in charge of establishing offices and operations
in Kurnool district. The project entailed the disbursement
of NREGA and SSP monies to over 600,000 beneficiaries, in
one of the most challenging political and geographic environments
to work in".
|
|
|
A
collective effort to integrate all the agriculture activities
from “farm gate to food plate”
|
|
|
|
|
Farming
best practices made available to all.
|
High
quality seeds produced and supplied at the village level.
|
|
|
|
|
|
|
Modern
farm equipment provided to farmers on a
pay and use basis.
|
High
quality organic manure will be made available to
farmers at affordable prices.
|
|
|
|
Heading
The
Green Basics field office is located on the outskirts
of Sompeta (Mandal Headquarters) in Srikakulam
district 10Km from the project location. It is
accessible, by both road, rail and air.
Road
We are located of National Highway 5 two kilometers
from the Sompeta Bus station.
Rail
We are 3 kilometers from Sompeta Railway station
(Kanchli). Bus’s and auto’s are available from
here to the project site on a frequent basis.
AIR
The nearest air port is Vishakapatnam which is
situated 180KM from the project site. There are
frequent buses and trains from here to Somepata.
|
|
Kanchali
Railway station is two kilometers from project
site
|
|
|
|
|
|
To
contact us:
Green
Basics Agri-clinc & Agri Business center
Mr
Ramana Babu Killi
C/o Bandala Apparao
Near NH-5 road,
Kanchili mandalam,
Amaravathi village,
Srikakulam,
Andhra Pradesh,
India.
Phone:
08947-233031
Fax: 08947-233031
E-mail: greenbasics@gmail.com |
|
|
|
No comments:
Post a Comment